క్రీడాభూమి

వారియర్స్ చేతిలో దబాంగ్ చిత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 12: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) టోర్నమెంట్‌లో పంజాబ్ వారియర్స్ జట్టు అగ్రస్థానానికి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పోరులో ఆ జట్టు 5-1 గోల్స్ తేడాతో దబాంగ్ ముంబయి జట్టును సొంత మైదానంలో మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో ఆద్యంతం పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన పంజాబ్ వారియర్స్‌కు పెనాల్టీ కార్నర్ల ద్వారా 2వ నిమిషంలో వరుణ్ కుమార్, 13వ నిమిషంలో మార్క్ గ్లెగ్‌హార్న్, 25వ నిమిషంలో క్రిస్ట్ఫోర్ సిరియెల్లో మూడు గోల్స్ అందించారు. దీంతో ప్రథమార్థం ముగిసే సమయానికే ఆ జట్టు 3-0 తేడాతో తిరుగులేని ఆధిక్యత సాధించింది. ఆ తర్వాత 40 నిమిషంలో అద్భుతమైన ఫీల్డ్‌గోల్ సాధించిన నిక్కిన్ తిమ్మయ్య కొద్దిసేపటికే మరో గోల్ సాధించి వారియర్స్ ఆధిక్యతను 5-0కు పెంచాడు. అయితే ఈ మ్యాచ్ చివర్లో ముంబయి జట్టుకు జెరేమీ హేవర్డ్ పెనాల్టీ కార్నర్ ద్వారా కంటితుడుపు గోల్‌ను అందించి కొంత మేర పరవు నిలబెట్టాడు. ఇంతకుముందు ఉత్తరప్రదేశ్ విజార్డ్స్ చేతిలో ఓటమిని ఎదుర్కొన్న పంజాబ్ వారియర్స్ ఈ మ్యాచ్‌లో ఆద్యంతం పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి దబాంగ్ ముంబయి జట్టును వారి సొంత గ్రౌండ్‌లోనే ఓడించడం విశేషం. దీంతో ఆరంభంలో వరుసగా నాలుగు ఓటములను ఎదుర్కొని ఆ తర్వాత మూడు విజయాలతో పుంజుకున్న ముంబయి జట్టుకు మళ్లీ షాక్ తగిలింది. ఈ విజయంతో కలిపి మొత్తం 27 పాయింట్లను కలిగివున్న పంజాబ్ వారియర్స్ పాయింట్ల పట్టికలో రాంచీ రేస్‌తో కలసి అగ్రస్థానాన్ని పంచుకుంటుండటంతో శనివారం ఈ రెండు జట్ల మధ్య జరుగనున్న మ్యాచ్ తీవ్ర ఆసక్తిని కలిగిస్తోంది. కాగా, ప్రస్తుతం 19 పాయింట్లతో అట్టడుగు స్థానానికి చేరిన దబాంగ్ ముంబయి జట్టు 14వ తేదీన రాంచీలో రాంచీ రేస్‌తోనూ, 16వ తేదీన ముంబయిలో ఉత్తరప్రదేశ్ విజార్డ్స్‌తోనూ తలపడనుంది.