పశ్చిమగోదావరి

విమర్శలు తట్టుకోలేక తప్పుడు కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసాపురం, జూన్ 6: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవినీతిని వైసిపి అధ్యక్షులు జగన్మోహన్‌రెడ్డి ఎండగడుతున్న తీరును తట్టుకోలేక టిడిపి నేతలు తప్పుడు కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి, వైసిపి రాష్ట్ర నాయకులు బొత్స సత్యనారాయణ విమర్శించారు. సోమవారం స్థానిక తెలగా కల్యాణ మండపంలో నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిధిగా బొత్స హజరై మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోపిడీలకు పాల్పడుతోందని ఆరోపించారు. పేదవాడికి రాష్ట్రంలో న్యాయం జరగడం లేదన్నారు. టిడిపిప్రభుత్వ తీరుపై జగన్ న్యాయపోరాటం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు అన్ని నియోజకవర్గాల్లో ఈనెల 8న ఆందోళనల చేపడుతామని తెలిపారు. సిఎం చంద్రబాబుతో పాటు మంత్రులపై పోలీస్‌స్టేషన్‌లో కేసులు పెడతామని వివరించారు. టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌పై ఆ పార్టీ నేతలు చెప్పులు విసిరారని గుర్తుచేశారు. ఈ ఘటనలో ఎన్టీఆర్ ఎంతగా క్షోభపడ్డారో టిడిపి నేతలు ఒక్కసారి ఆలోచించుకోవాలని బొత్స అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్ళ నాని మాట్లాడారు. కార్యకర్తలు ఐక్యంగా ఉండి పార్టీ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. నరసాపురం నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుకు అప్పగించే విషయాన్ని జగన్‌కు విన్నవిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ, కారుమూరి నాగేశ్వరరావు, పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు కొయ్యే మోషేన్‌రాజు మాట్లాడుతూ కష్టకాలంలో ఉన్న పార్టీని విడిచి కొత్తపల్లి సుబ్బారాయుడు స్వార్థంతో టిడిపి చేరానని, ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారన్నారు. మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైసిపి నాయకులు సాయినాథ్ ప్రసాద్, ప్రసాద్, రాధాకృష్ణ, రాజు, కామన బాల సత్యనారాయణ, నాగరాజు, ఇంజేటి జాన్‌కెనడి, అందే భుజంగరావు తదితరులు పాల్గొన్నారు.
ఆషామాషా అధికారి కాదు
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, జూన్ 6: ఆషామాషీ ఆఫీసర్ కాదాయన.... జిల్లా పాలనకు కీలకమైన వ్యవస్ధకు కీలకాధికారి... ఎన్నికలు, పుష్కరాలు, సిఎం టూర్లు, బదిలీలు, పదోన్నతులు ఇలా అన్నీ ఆయనకు వరాలు అందించేందుకే వచ్చాయా అన్న అనుమానం కలిగే రీతిలో కోట్ల రూపాయలు ఆయన కైంకర్యం చేశారని ఉద్యోగ వర్గాలే పేర్కొనడం గమనార్హం. గతంలో పనిచేసిన జిల్లాల్లో కూడా అవినీతిలో చెయ్యితిరిగిన ఈ అధికారి పంట పచ్చని పశ్చిమగోదావరిలో కూడా విరగపండిందంటే ఆతిశయోక్తి కాదు. ముక్కోపిగా ఉంటూ సదా పనిలోనే నిమగ్నమయ్యే ఈ అధికారికి సహచర అధికారులన్నా కనీస గౌరవం ఉండదు. ఇక కింది ఉద్యోగులంటే ఛీత్కారమే. నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తున్నట్లు కలరింగ్ ఇచ్చే ఆయన తెరవెనుక కార్యక్రమాలు మాత్రం మూడవ కంటికి తెలియకుండా కానిచ్చేయటంలో మహాదిట్ట అని ఆ శాఖ ఉద్యోగులే కాకుండా మిగిలిన శాఖల అధికారులు కూడా పేర్కొంటున్నారు. తన కింద పనిచేసే కొంతమంది ఉద్యోగులనే ‘కలెక్షన్ బాయ్’లుగా మార్చి వారి సేవలతో కుబేరుడుగా మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన వరాన్ని అందివచ్చిన అవకాశంగా మార్చుకున్న ఈయన గత కొద్దికాలంగా చెలరేగిపోయారంటే ఆశ్చర్యం కాదు. ఉన్నతాధికారుల నమ్మకాన్ని తన కళతో సాధించుకుని తన పనిని చాకచక్యంగా నిర్వహించుకున్న అ అధికారి మహామేధావేనంటున్నారు మిగిలిన అధికారులు, ఉద్యోగులు. తాను ఎన్ని తప్పులు చేసినా ఎటువంటి ఇబ్బందులు లేకపోవటంతో రెచ్చిపోతున్న ఈయన ఇతర శాఖల అధికారులు, ఉద్యోగులు, తన కింద పనిచేసే ఉద్యోగులు తప్పు చేస్తే మాత్రం అదేదో మహాపరాధం అన్నట్లు ఉన్నతాధికారుల వద్ద దాన్ని పెద్దదిగా చూపించి వారికి కఠినశిక్షలు పడేవిధంగా చేసేస్తారు. గతంలో ఎన్నికల సమయంలో ఆయన చేతివాటం చూసి కంగుతిన్న ఒక ఉన్నతాధికారి ఆయనను జిల్లా నుంచి సాగనంపేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, ఆయనే బదిలీపై వెళ్లిపోవటంతో ఈ అధికారి అవినీతికి అడ్డూఅదుపు లేకుండా పోయిందని చెపుతున్నారు. గతంలో ఉత్తరాంధ్రలో పనిచేసిన సమయంలో కూడా ఈ అధికారి అవినీతిని సహించలేక అ జిల్లా నుంచి పంపించివేశారని సహచర అధికారులే పేర్కొంటున్నారు. ఆయన నైపుణ్యం, అవినీతి పురాణాలు, అక్రమాల చిట్టాలు ఉన్నతాధికారులకు తెల్సినా పనిఒత్తిడో, లేక శాఖ పరువు పోతుందోనన్న భయమోగాని వారు కూడా మిన్నకుండిపోతున్నారు. పచ్చనోట్లు చూస్తే మేఘాల్లో తేలిపోయే ఈ అధికారి నిర్వాకాల్లో జరిగిన సంఘటనలు మచ్చుకు కొన్ని...
*** ఎన్నికల సమయంలో బిల్లులు చెల్లింపునకు భారీగా పర్సంటేజీలు వసూళ్లు. ఆదశలో పత్రికల్లో వార్తలు రావటంతో మరింత భారీగా పర్సంటేజీలు పెంచేసి వసూలు చేసిన వైనం.
***పుష్కరాలకు కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేయగా కిందిస్దాయి అధికారులకు స్వల్ఫ మొత్తంలో విడుదల చేసి మిగిలిన మొత్తాలను డూప్లికేట్ బిల్లులు పెట్టి మాయం చేసిన వైనం.
***సిఎం టూరు వచ్చిందంటే అ అధికారికి పండగేనని చెప్పుకోవాలి. సిఎం టూర్‌కు రమారమిగా 50నుంచి 60 లక్షల రూపాయలు ఖర్చు అయితే ఈయనకు విధిగా రూ. 5లక్షలు ముట్టచెప్పాల్సిందే.
***గత కొనే్నళ్లుగా ఆ శాఖ పరిధిలో పలువురికి పదోన్నతులు, బదిలీలు కల్పించిన ప్రతి సమయంలోనూ ఆయన బాగా లాభపడ్డారని ఆ శాఖ ఉద్యోగులే పేర్కొంటున్నారు.
***జిల్లాలోని మెట్ట మండలంలో సువిశాలమైన వ్యవసాయ క్షేత్రం, సర్కారు జిల్లాలో మరొక వ్యవసాయ క్షేత్రం ఈయన సొంతమని వినికిడి.
***రాజధాని అమరావతి ప్రాంతంలో ఇటీవల భారీగా పొలాలు కొనుగోలు చేసేందుకు ఈయన ప్రయత్నించారని శాఖ ఉద్యోగులే గుసగుసలు ఆడుకుంటున్నారు.
***ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో ఈయన ఒక ప్లాట్ కొనుగోలు చేశారు. దాన్ని అధునీకరించేందుకు, అవసరమైన ఫర్నిచర్‌ను అమర్చేందుకు ఇక్కడ నుంచే ఒక కాంట్రాక్టరును పంపించారని సమాచారం. ఆతర్వాత సదరు కాంట్రాక్టరుకు చెల్లించాల్సిన బిల్లులను కూడా శాఖ పరిధిలోని నిధులతోనే చెల్లించారని ఉద్యోగులు చెవులు కొరుక్కుంటున్నారు.
కొసమెరుపు: ఈ అధికారి అవినీతి లీలలను ఒక ఉన్నతాధికారి వద్ద ప్రస్తావిస్తే ‘కష్టపడి పనిచేస్తున్నారు కదా...కొన్ని విషయాలు చూసిచూడనట్లు వదిలేయాల్సిందే’ అంటూ వ్యాఖ్యానించారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎసిబి సోదాలు
జంగారెడ్డిగూడెం, జూన్ 6: జంగారెడ్డిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో లెక్కకు మించి ఉన్న నగదు స్వాధీనం చేసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 76 వేల రూపాయల నగదు, పక్కనే గల దస్తావేజు లేఖరి కార్యాలయంలో 1,00,300 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయంలో అధికారులు రిజిస్ట్రేషన్లకు మామూళ్లు తీసుకుంటున్నట్టు అందిన సమాచారం మేరకు సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఆకస్మిక దాడి చేసినట్టు ఎసిబి డిఎస్పీ కరణం రాజేంద్ర విలేకరులకు చెప్పారు. ఈ సందర్భంగా కార్యాలయంలో రికార్డులు స్వాధీనం చేసుకున్నామని, తనిఖీలు చేసామని చెప్పారు. దాడి సమయంలో కార్యాలయంలో ఏడుగురు దస్తావేజు లేఖరులు ఉన్నారని, వారి వద్ద 62 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కార్యాలయం రికార్డు రూములో అనధికారికంగా ఉన్న 14 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు సబ్ రిజిస్ట్రార్‌తో చనువుగా ఉంటున్న దస్తావేజు లేఖరి భోగరాజు శ్రీనివాసరావు కార్యాలయంలో కూడా తనిఖీలు చేసినట్టు తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పక్కనేగల శ్రీనివాసరావు కార్యాలయంలో 1,00,300 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని, శ్రీనివాసరావు సబ్ రిజిస్ట్రార్ వద్ద సోమవారం రిజిస్ట్రేషన్ కోసం ఐదు దస్తావేజులు సమర్పించినట్టు చెప్పారు. ఈ మేరకు శ్రీనివాసరావు స్టేట్‌మెంట్ నమోదు చేసామన్నారు. దాడి జరిగే వరకు కార్యాలయంలో ఏడు దస్తావేజులు రిజిస్ట్రేషన్ జరిగినట్టు చెప్పారు. మరో ఐదు రిజిస్ట్రేషన్‌కు పరిశీలనలో ఉన్నాయని వివరించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అనధికారికంగా ఉన్న ఏడుగురు దస్తావేజు లేఖరులను కూడా విచారిస్తున్నట్టు చెప్పారు. రిజిస్ట్రేషన్లు జరిగే సమయంలో క్రయ, విక్రయదారులు తప్ప ఇతరులను అనుమతించరాదని చెప్పారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిశితంగా తనిఖీలు చేసామని, ఇసి నకళ్ళు, డిఎలకు సంబంధించిన చిల్లర జమలు 1,600 రూపాయల నగదు ఉందని, ఇది సక్రమమేనని డిఎస్పీ రాజేంద్ర చెప్పారు. అనుమానం ఉన్న, పరిశీలించాల్సిన రికార్డులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రికార్డులు పరిశీలించిన తరువాత కార్యాలయంలో అనధికార నగదు 76 వేలు, దస్తావేజు లేఖరి వద్ద 1,00,300 రూపాయలు స్వాధీనం చేసుకున్నామన్నారు. కాగా, ఇదే సబ్ రిజిస్ట్రార్ పని చేస్తుండగా గత ఏడాది కూడా కార్యాలయంపై ఎసిబి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో అనధికార నగదు 80 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవలసి ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా డిఎస్పీ రాజేంద్ర చెప్పారు. ఈ దాడిలో ఎసిబి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ యుజె విల్సన్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఓ పక్క అడ్డుకట్టలు...మరో పక్క నీరు...
నిడదవోలు, జూన్ 6: కాలువ ఆధునికీకరణ పనులు పూర్తి కాకుండానే సోమవారం 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం అధికారుల నిర్లక్ష్యఆం, కాంట్రాక్టర్ల అలసత్వానికి అద్దం పడుతోంది. ఏప్రిల్ 27న పశ్చిమ డెల్టా ప్రధాన కాలువకు నీటిని నిలిపివేశారు. సాధారణంగా నీటిని నిలిపివేసిన వారం రోజుల్లో కాలువకు ఆధునీకరణ పనులు చేపట్టాల్సి ఉంటుంది. అయితే ఈసారి 20 రోజులు గడిచాక పనులు ప్రారంభించారు. విజ్జేశ్వరం నుండి శెట్టిపేట వరకు 9.3 కిలోమీటర్ల వరకు ఉన్న కాలువ పూడికతీతకు రూ.కోటి 60 లక్షలతో పనులు ప్రారంభించారు. జూన్ 1వ తేదీ నాటికి పనులు పూర్తి కాకపోవడంతో ప్రధాన కాలువకు నీటిని విడుదల చేయడాన్ని వాయిదా వేశారు. ఇలావుండగా ఒకపక్క కాలువ పూడికతీత పనులు జరుగుతుండగానే అధికారులు హడావుడిగా సోమవారం నీటిని విడుదల చేయడం తో పనుల నాణ్యతపై రైతులు ఆందోళన చెందుతున్నారు. పూడిక పూర్తిగా తీసివేస్తే నీటి ఎద్దడిలో సైతం దిగువ ఉన్న గ్రామాలకు గోదావరి నీరు పుష్కలంగా అందుతుంది. సోమవారం హెడ్ స్లూరుూస్ నుండి నీటిని విడుదలచేయగా సమీపంలోని గోపవరంవద్ద మట్టి అడ్డుకట్ట నిర్మించి పూడికతీత పనులు చేయడం చూసే వారిని విస్మయానికి గురిచేసింది. దీనిపై ఇరిగేషన్ ఇఇ శ్రీనివాస్‌ను వివరణ కోరగా అడ్డుకట్ట తొలగిస్తాం, పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు.