పశ్చిమగోదావరి

నాబార్డు నిధులతో గ్రామాల్లో అప్రోచ్ రోడ్లు: మంత్రి అయ్యన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూన్ 6: రాష్ట్రంలో 700 కోట్ల రూపాయల నాబార్డు నిధులతో పల్లెసీమల్లో అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి ఒక ప్రణాళిక అమలుచేస్తున్నామని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చెప్పారు. స్ధానిక జడ్పీ అతిథిగృహంలో సోమవారం ఏలూరు ఎంపి మాగంటి బాబు మంత్రిని కలిసి కైకలూరు, నూజివీడు, ఉంగుటూరు, దెందులూరు, పోలవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ దేశచరిత్రలో ఎన్నడూ లేనివిధంగా గ్రామీణ రహదారుల అభివృద్ధికి పెద్దఎత్తున బడ్జెట్‌లో నిధులు కేటాయించామన్నారు. పల్లెప్రాంతాల్లో అప్రోచ్ రోడ్డులను నిర్మించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. 13వేల గ్రామపంచాయితీల్లో ఆర్ధిక సంవత్సరంలో రెండువేల కోట్ల రూపాయలతో అయిదువేల కిలోమీటర్ల పొడవునా సిమెంట్‌రోడ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించామని, ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే 600 కిలోమీటర్ల గ్రామీణ రహదారులను సిమెంటురోడ్లుగా తీర్చిదిద్దుతామన్నారు.
విర్డ్స్‌కు రూ. 15 కోట్లు కేటాయింపు
ద్వారకాతిరుమల, జూన్ 6: పోలియో వికలాంగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు దాతలు సహకారంతో ద్వారకాతిరుమల శివారులో నిర్మించిన విర్డ్స్ ఆసుపత్రికి రూ.15 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి (రెవెన్యూ) జెఎస్‌వి ప్రసాద్ జిఒఎంఎస్ నెం.238ని విడుదల చేశారు. కేటాయించిన నిధుల్లో భాగంగా రూ.10 కోట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఫండ్స్ నుంచి, అలాగే మిగిలిన రూ.5 కోట్లు ద్వారకాతిరుమల దేవస్థానం నుంచి కార్పస్ ఫండ్‌గా ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విడుదలైన ఈ నిధులను శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టులో కార్పస్ ఫండ్‌గా జమ చేయాలని వివరించారు. శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చి అండ్ రిహేబిలిటేషన్ ఫర్ ది డిసేబుల్డ్ (విర్డ్స్) ఆసుపత్రి 2007లోట్రస్టుగా ఏర్పడింది. దీనికి ద్వారకాతిరుమల దేవస్థానం గ్రామ శివారులోని అయిదెకరాల భూమిని కొన్ని షరతులతో 11 ఏళ్లపాటు లీజుకు ఇచ్చింది. అందులో వంద పడకలతో పక్కా ఆసుపత్రి భవనాన్ని రూ.15 కోట్లతో నిర్మించి, సెప్టెంబర్ 2015న ప్రారంభించారు. ఈ ఆసుపత్రిలో సెరిబ్రల్‌పాల్సి, పోలియో, ట్రామా మేనేజ్‌మెంట్ ఆర్థోస్కోపి, జాయింట్ రీప్లేస్‌మెంట్ వంటి వైద్యసేవలను ఉచితంగా, లాభాపేక్ష ఆశించకుండా అందించేందుకు నిర్ణయించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీమేరకు టిటిడి నుండి రూ.10 కోట్లు, ద్వారకాతిరుమల నుండి రూ.5 కోట్లు విర్డ్స్ ఆసుపత్రికి సమకూరాయి. ఈ నిధుల ద్వారా పోలియో వికలాంగులకు మెరుగైన వైద్య సేవలు, కాలిపర్స్‌తోపాటు మందులు, ఇతర పరికరాలు అందించనున్నారు.
రీయింబర్స్‌మెంట్ సౌకర్యం
ఎన్టీఆర్ వైద్య సేవా పథకాన్ని ఈ ఆసుపత్రిలో అమలు చేసేందుకు ఆ పథకం సిఇఒ నిర్ణయిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విర్డ్స్ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ విభాగంలో సేవలు పొందిన ప్రభుత్వ ఉద్యోగులు, తదితరులు రీయింబర్స్‌మెంట్‌కు సైతం అర్హులను చేస్తూ నిర్ణయించారు. దీంతో ఖరీదైన వైద్యం ఇకపై ఈ ఆసుపత్రిలో ఉచితంగా లభించనుంది.