పశ్చిమగోదావరి

విప్లవ ఉద్యమనేత రాఘవులు కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉండి, జూన్ 7: విప్లవ కమ్యూనిస్టు ఉద్యమ నేత జివి రాఘవులు(83) మహాదేవపట్నం శివారు ఉప్పరగుడెంలో మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఇటివలే ఆయన నాయకత్వంలో ఏర్పాటుచేసిన సిపిఐ ఎంఎల్ ప్రజాశక్తి పార్టీకి కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నికైన నాలుగు నెలలోనే ఆయన మృతి చెందటం విప్లవోద్యమానికి తీరని లోటని పలువురు నివాళులర్పించారు. సుమారు 60 సంవత్సరాలు అవిశ్రాంతంగా విప్లవోద్యమంలో పనిచేసిన రాఘవులు మృతివార్త తెలిసిన వెంటనే అనేక జిల్లాల నుండి విప్లవ సంఘాల నాయకులు, పౌరహక్కుల సంఘం నాయకులు, సిపిఐ నాయకులు ఉప్పరగుడెం వచ్చిన ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. రాఘవులు భౌతికాయంపై ఎర్రజెండా కప్పి విప్లవ గీతాలు ఆలపిస్తూ ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలున్నారు. ఆయన భార్య చనిపోవటంతో కుమారులు, అల్లుళ్ల ఇంటివద్ద ఉంటున్నారు. పేదరికంలో మగ్గుతునే జాతీయ స్థాయిలో విప్లవ పార్టీని స్థాపించిన మహానేత రాఘవులు అని పలువురు నాయకులు సంతాపంలో పేర్కొన్నారు.
నేటికి కనీసం రవాణా సదుపాయం లేని ఉండి మండలం మహాదేవపట్నం సమీపంలో ఉన్న ఉప్పరుగుడెంకు చెందిన రాఘవులు 1952లో కమ్యూనిస్టు పార్టి కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించారు. 1964లో కమ్యూనిస్టు పార్టీ చీలిక వరకు అందులో కొనసాగారు. అనంతరం కొద్దికాలం సిపిఎంలో ఉన్నప్పటికీ తిరిగి సిపిఐ ఎంఎల్‌లో చేరారు. అందులో చీలిక అనంతరం 1984లో చండ్ర పుల్లారెడ్డి గ్రూపులో, 1988లో కామ్రేడ్ రాజన్న వర్గంలో పనిచేశారు. గిరిజనులకు న్యాయం జరగాలంటే అన్ని విప్లవ పార్టీలు ఒక వేదిక మీదకు రావాలని ఏడు పార్టీలతో చర్చలు జరిపి 1992లో అందరినీ ఒక తాటిమీదకు తెచ్చారు. ఆ పార్టీకి రైతుకూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా, పార్టీ రాష్ట్ర నాయకులుగా పనిచేశారు. 2005లో నల్గొండ వద్ద ఈయన ప్రయాణం చేస్తున్న జీపుపై ప్రత్యర్థులు కాల్పులు జరిపారు. 2016లో ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గడ్, బీహార్, ఒడిస్సా, తదితర రాష్ట్రాల నుండి వచ్చిన విప్లవ నేతలతో కలిసి భీమవరంలోనే సిపిఐ ఎంఎల్ ప్రజాశక్తి పార్టీని స్థాపించి మొదటి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై తన సంపాదకత్వంలో రెండు తెలుగు, ఇంగ్లీష్ పత్రికలు ప్రచురణ బాధ్యతలు చేపట్టారు. తీవ్ర అస్వస్థతకు లోనై గత కొన్ని రోజులుగా స్వగ్రామంలో కుటుంబ సభ్యుల వద్దే ఉంటున్నారు.
రాఘవులు మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణ, సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ అన్నారు. పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేడంగి చిట్టిబాబు, ఎన్ శ్రీమన్నారాయణ, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ కేంద్రకమిటీ సభ్యులు బి బంగార్రాజు, న్యూడెమోక్రసీ నాయకులు జె వెంకటేశ్వర్లు, రైతుకూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు నివాళులర్పించారు.