పశ్చిమగోదావరి

భీమవరంలో భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూన్ 7: భీమవరం పట్టణంలో మంగళవారం ఉదయం భారీ వర్షం కురిసింది. సుమారు అయిదు గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో పట్టణమంతా జలమయమైంది. చిన్న చిన్న చినుకులతో ప్రారంభమై ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురియడంతో పల్లపుప్రాంతాలతో పాటు రహదారులన్నీ జలమయమయ్యాయి. రహదారులపై సుమారు నాలుగు అడుగుల మేర వర్షపునీరు నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో వర్షపునీటిలో వాహనాలు చిక్కుకుపోయాయి. ప్రధాన రహదారులపైనే ట్యాంకర్ టైర్లను ఆనుకుని వర్షపునీరు ప్రవహించింది. భారీ వర్షం కారణంగా ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. దుకాణదారులు ఇక్కట్లకు గురయ్యారు. ప్రధాన సెంటర్లు, రహదారుల పైనే భారీగా వర్షం నీరు చేరడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.