పశ్చిమగోదావరి

రెండేళ్లలో ఏం చేశారు ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూన్ 7: కేంద్రంలో భారతీయ జనతాపార్టీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారాలు చేపట్టి రెండేళ్లు గడిచినా ప్రజలకు ఏంచేశారని సిపిఎం నేతలు ప్రశ్నించారు. భీమవరంలో సిపిఎం రాష్ట్ర మహాసభలు మంగళవారం నుండి ప్రారంభమయ్యాయి. జిల్లా కార్యదర్శి బి బలరాం అధ్యక్షత వహించారు. పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి పి మధు, ఎంఎ గఫూర్ తదితరులు ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణ దీక్షలు ఏవరి కోసం చేస్తున్నారని రాఘవులు ప్రశ్నించారు. విభజన చట్టం వల్ల రాష్ట్రానికి ఎటువంటి లాభం చేకూరలేదన్నారు. పరిశ్రమలు తీసుకువస్తామని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని కల్లబొల్లి కబుర్లు చెబుతోందన్నారు. రాబోయే మూడేళ్లలో రాష్ట్రానికి హోదా కాదు లోకేష్‌కు హోదా తీసుకువచ్చే పనిలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారన్నారు. ఇప్పటికే లోకేష్‌ను రహస్యంగా జిల్లాల్లో తిప్పుతున్నారని రాఘవులు వెల్లడించారు. కృష్ణానది ఒడ్డున సిఎం చంద్రబాబునాయుడు చట్టవిరుద్దమైన నివాసంలో ఉంటున్నారని, డబ్బు ఉన్న వారికి మాత్రమే కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యభద్రత లేదని, ప్రతి వెయ్యి మందిలో 43 మంది అనారోగ్యంతో మృతిచెందుతున్నారన్నారు. రెండేళ్ల పాలనపై చంద్రబాబు సమీక్ష చేసుకోవాలని సూచించారు.
పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి మధు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని, కౌలురైతులకు సిపిఎం రక్షణ కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. రెండేళ్లుగా పరిస్థితిని పరిశీలిస్తే రాష్ట్రంలో 20లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి పడిపోయిందని తెలిపారు. కమ్యూనిస్టులకురానున్నకాలంలో మంచి రోజులు ఉన్నాయని, వాటి కోసం ఉద్యమాలు చేయనున్నామన్నారు. బహిరంగ మహాసభకు ముందుగా ప్రదర్శన చేపట్టారు. పార్టీ నాయకులు మిడియం బాబూరావు, ధనాల సుబ్బారావు, వి ఉమామహేశ్వరి, ఆర్‌ఎస్, మంతెన సీతారాం, చింతకాయల బాబూరావు, జుత్తిగ నరసింహమూర్తి, డివిజన్ కార్యదర్శి బి సత్యనారాయణ, డి రమాదేవి, జెఎన్‌వి గోపాలం పాల్గొన్నారు.