పశ్చిమగోదావరి

బీసీల్లో చేర్చేంతవరకు ఉద్యమిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూన్ 9: పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా, కాపు సామాజికవర్గానికి చెందినవార్ని ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా అదరం.. బెదరమని కాపునాయకులు అన్నారు. కాపులను బిసిల్లో చేర్చేంతవరకు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం స్ఫూర్తితో ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ముద్రగడకు మద్దతుగా తాము కూడా ఆందోళన బాట పడతామని, అయితే ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ఈ ఆందోళన చేపడతామని భీమవరం కాపునాడు పట్టణ కమిటీ పేర్కొంది. గురువారం శ్రీకృష్ణదేవరాయ కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో కాపునాడు పట్టణ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి బేతు కృష్ణారావు, మాగాపుప్రసాద్‌లు మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కాపులను మోసం చేశారని విమర్శించారు. ముద్రగడ కాపుల కోసం కాపుకాచి ఉద్యమించారని, తుని సంఘటన నేపథ్యంలో ఎటువంటి కేసులు, అరెస్టులు ఉండవని స్పష్టంచేసిన సిఎం ఇప్పుడు ఎందుకు అరెస్టులు చేస్తున్నారని ప్రశ్నించారు. తన కుటుంబ సభ్యులతో సహా ఉద్యమిస్తున్న ముద్రగడకు కాపు సామాజికవర్గానికి చెందినవారమంతా ఎప్పుడూ అండగా నిలుస్తామని చెప్పారు. అహింసా మార్గంలో ముందుకు వెళ్దామని భావిస్తున్న నేపథ్యంలో పోలీసులు కఠినమైన చట్టాలను అమలుచేస్తున్నారని, దీనివల్ల ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారని తెలిపారు. ఇటువంటి సంఘటనల వల్ల నివురుగప్పిన నిప్పుల మాదిరిగా కాపు ఆగ్రహాన్ని చవిచూడాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ముద్రగడ పిలుపును పాటిస్తామన్నారు. విలేఖర్ల సమావేశంలో గ్రంధి నానాజీ, యాతం జగన్నాథం, ఎస్‌ఎస్ రావు, కోయ శ్రీరామ్మూర్తి, ముత్యాల రామారావు, గుద్దటి ఆంజనేయులు, నూకల సూరిబాబు పాల్గొన్నారు.