పశ్చిమగోదావరి

రాష్ట్ర ప్రభుత్వ కమిటీలో అంగరకు స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకొల్లు, జూన్ 10: మహిళా, శిశువు, మానసిక వికలాంగులు, వృద్ధుల అభివృద్ధి కమిటీలో సభ్యునిగా ప్రభుత్వ విప్ అంగర రామమోహన్‌ను సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వికలాంగులకు పూర్తి రక్షణ కల్పించే ఈ కమిటీ మూడు సంవత్సరాలు అమలులో ఉంటుంది. ప్రతి ఆరు మాసాలకు తప్పనిసరిగా ఈ కమిటీ సమావేశం జరిపి జరుగుతున్న పనులను సమీక్షిస్తుంది. దీనికి ఈ శాఖ మంత్రి ఛైర్‌పర్సన్‌గా ఉంటారు. ఎక్స్ అఫిషియో సభ్యులుగా విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, ఆర్థికశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, జనరల్ అడ్మినిస్ట్రేషన్, హోంశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, పరిశ్రమల శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మరో రెండు శాఖల కార్యదర్శులు ఉంటారు. సేవా సంస్థల నుండి ఆసియన్ ఎయిడ్ హైస్కూల్ కార్యదర్శి సిహెచ్ శామ్యూల్, కాకినాడ ఉమా మానో వికాస కేంద్రం అధ్యక్షులు ఎస్పీ రెడ్డి, విశాఖపట్నం మండల వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు పియస్‌టి పట్నాయక్, ఎమ్మెల్యేల నుండి నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఎమ్మెల్సీల నుండి అంగర రామమోహన్ ఉంటారు. ఈ శాఖ డైరెక్టర్, ప్రిన్సిపల్ కార్యదర్శి కూడా సభ్యులుగా ఉంటారు. చంద్రబాబు తనను గుర్తించి బాధ్యతాయుతమైన పదవి అప్పగించినందుకు అంగర కృతజ్ఞత తెలిపారు.