పశ్చిమగోదావరి

చెడ్డపేరు తీసుకురావద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూన్ 10 : జాతి పేరుతో అరాచకాలు సృష్టించడం వలన ఎటువంటి ప్రయోజనాలు వుండవని, చివరకు ఆ జాతికే చెడ్డపేరు తీసుకువచ్చే పరిస్థితి వస్తుందని, అలాంటివి విరమించుకోవాలని రాష్ట్ర మంత్రి పీతల సుజాత ముద్రగడ పద్మనాభంకు విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధితో కాపుల అభ్యున్నతికి కృషి చేస్తుంటే ఉద్యమం చేయడం వలన ఏం ప్రయోజనం వుంటుందని ఆమె ప్రశ్నించారు. కాపులూ ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని, గతంలో ఏ ప్రభుత్వమూ చేయని కార్యక్రమాలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. స్థానిక జిల్లా టిడిపి కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి పీతల మాట్లాడుతూ అప్పట్లో వై ఎస్ మానిఫెస్టోలో కాపుల అభివృద్ధి అంశాన్ని పేర్కొన్నప్పటికీ ఆ పదేళ్లు ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. జగన్ చెప్పినట్లు చేయడం వలన జాతి ప్రయోజనాలు సాధించవని, దీక్షలతో కాపుల అభివృద్ధి ఏ విధంగా సాధ్యమవుతుందని ఆమె ప్రశ్నించారు. ఇప్పటికే ఉద్యమాల పేరుతో అరాచకాలకు కారణమై జాతికి చెడ్డపేరు తీసుకువచ్చారని, మేలు చేసే ఉద్దేశ్యముంటే ఇలాంటి పనులు మానుకోవాలని సూచించారు. కేవలం ఉనికి దెబ్బతింటుందన్న ఉద్దేశ్యంతోనే ముద్రగడ ఇలాంటి కార్యక్రమాలకు దిగుతున్నారని విమర్శించారు. జగన్ ప్యాకేజీల కోసం ఆశించవద్దని, జాతికి చెడ్డపేరు తీసుకురావద్దని ఒక సోదరిగా ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో ముద్రగడ ఉచ్చులో కాపులు పడవద్దని, ప్రభుత్వం కాపుల అభ్యున్నతికి కట్టుబడి వుందని పేర్కొన్నారు. ముద్రగడ ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తే కాపుజాతి వారిని ప్రశ్నిస్తుందని, తిరగబడే పరిస్థితి కూడా వుంటుందని పేర్కొన్నారు. టిడిపి జిల్లా అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ తునిలో రత్నాచల్ రైలును దగ్ధం చేసిన ఘటనలో చర్యలు తీసుకోకూడదంటే ఎలా అని ప్రశ్నించారు. ఆ ఘటనలు కాపు జాతినే కాకుండా రాష్ట్రాన్ని కూడా భయభ్రాంతులకు గురిచేసిందని పేర్కొన్నారు. ఇలాంటి సమయాల్లో చర్యలు తీసుకోకపోతే మరో సంఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికే కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించి బిసి రిజర్వేషన్ కోసం మంజునాధ కమిషన్‌ను ఏర్పాటు చేయడమే కాకుండా కాపుల అభ్యున్నతి కోసం పలు కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవి అందించడంతోపాటు పలువురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారని చెప్పారు. ఇప్పుడు కాపు జాతికి ఏం అన్యాయం జరిగిందని ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని ప్రశ్నించారు. మీ సొంత ప్రయోజనాల కోసం జాతి ప్రయోజనాలను ఫణంగా పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం కాపుల అభివృద్దికి చేపట్టిన పలు కార్యక్రమాలను వివరించారు. సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఉప్పాల జగదీష్‌బాబు, కార్యాలయ సమన్వయ కార్యదర్శి పాలి ప్రసాద్ పాల్గొన్నారు.