వరంగల్

విద్యార్థిని కిడ్నాప్.. ఆపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూన్ 6: రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ మహిళలపై అత్యాచారాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సోమవారం వరంగల్‌లో వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన కలకలం రేపింది. హన్మకొండ ములుగురోడ్ సమీపంలో ఉంటున్న 19 సంవత్సరాల విద్యార్థిని ఐటిఐ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన జోగు శ్రీనివాస్ అనే వ్యక్తి ఆ విద్యార్థినికి కొద్ది రోజుల క్రితం పరిచయమయ్యాడు. చనువుగా ఉంటూ ఆ విద్యార్థినిని నమ్మించి అప్పుడప్పుడు బైక్‌పై తీసుకెళ్లే స్థాయికి వెళ్లాడు. అదే క్రమంలో శనివారం కళాశాలకు వెళ్లి తిరిగి వస్తున్న విద్యార్థిని కోసం రోడ్డుపై బైక్‌తో శ్రీనివాస్ ఎదురుచూస్తుండగా ఆ విద్యార్థిని అటుగా రావడంతోనే బైక్‌పై నేరుగా కాజీపేట, మడికొండవైపు తీసుకెళ్లాడు. అక్కడ నుండి శ్రీనివాస్ వరంగల్ కాకతీయ కాలనీలో ఉంటున్న తన మిత్రునికి ఫోన్‌చేసి తాను ఒక అమ్మాయితో మీ ఇంటికి వస్తున్నానని, తనకు ఆశ్రయం కల్పించాలని కోరగా శ్రీనివాస్ స్నేహితుడు అందుకు అంగీకరించి తన ఇంటి తాళం శ్రీనివాస్‌కు అప్పగించి వెళ్లాడు. దీంతో ఆ విద్యార్థినిని తన స్నేహితుని ఇంట్లోకి తీసుకెళ్లి బలవంతంగా ఆమెపై అత్యాచారానికి పాల్పడి అదే రూంలో ఆ విద్యార్థినిని బంధించాడు. అదునుచూసి ఆ విద్యార్థిని ఏదో విధంగా అక్కడ నుండి తప్పించుకొని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పగా సోమవారం విద్యార్థిని తల్లిదండ్రులు హన్మకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సిఐ సంపత్‌కుమార్ కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలిస్తున్నామని సిఐ తెలిపారు. నిందితుడిపై కిడ్నాప్, అత్యాచారం కేసులు నమోదు చేసినట్లు సిఐ వెల్లడించారు.

కోదండరాం ఖబడ్దార్
* వైద్యారోగ్య మంత్రి లక్ష్మారెడ్డి ఫైర్
* వ్యాఖ్యలపై అనుమానాలున్నాయ్
* ఎవరి కొమ్ము కాయడానికి ఆ మాటలు
* ఆయన అసలు రంగు బయటపడింది
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, జూన్ 6: ఇన్ని రోజులు ఒక పెద్ద మనిషిగా, సమాజంలో గౌరవం ఉన్న వ్యక్తిగా పిలవబడుతున్న పొలిటికల్ జెఎసి చైర్మన్ కోదండరాం ఉన్నట్లుండి ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి తీవ్రంగా ఖండించారు. సోమవారం వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కోదండరాం ఎవరి కొమ్ము కాయడానికి ప్రభుత్వంపై విమర్శలు చేశాడో అర్థవౌతోందన్నారు. ఆయన నిజ స్వరూపం ఏమిటో ప్రజలకు కూడా అర్థమైపోయిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంటే చేతకాకుంటే ప్రభుత్వం తప్పుకోవాలని కోదండరాం చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనకు ఇటీవల వరుసగా జరిగిన ఉప ఎన్నికలు, జిహెచ్‌ఎంసి, జిడబ్ల్యుఎంసి, ఖమ్మం, సంగారెడ్డి పురపాలక సంఘ ఎన్నికలే నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన నచ్చే ప్రజలు వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు పట్టం కడుతున్నారని ఆయన అన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి పథకాలు సమర్థవంతంగా జరుగుతున్నాయని, ఈ ఫలితాలు మరో రెండేళ్లలో ప్రజల ముందుకు వినియోగంలోకి వస్తాయని అన్నారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అధికారం చేపట్టగానే 17వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిందన్నారు. కోదండరాంకు ప్రభుత్వంపై విమర్శించే అర్హత, హక్కు లేదన్నారు. ఒక గౌరవమైన వ్యక్తిగా కోదండరాం ప్రభుత్వానికి అవసరమైన సలహాలు ఇవ్వాలే తప్ప ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. తెలంగాణలో మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ పార్టీ మొదట ఏడు నెలలు ఇబ్బందులు పడ్డామని, అధికారుల కేటాయింపులు జరుగక ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఆ తరువాత అన్నింటినీ నిలదొక్కుకుంటూ రెండేళ్లలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ బంగారు తెలంగాణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. పేదల సంక్షేమం కోసమే ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నాడన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ విజన్ అర్థమైన వారే సిఎం వెంట ఉన్నారని, అర్థం కాని వారంతా బయట ఉన్నారన్నారు. గతంలో తెలంగాణలో వైద్య రంగాన్ని గత పాలకులు పూర్తిగా నిర్వీర్యం చేశారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాతే పేదలకు మెరుగైన వైద్య సౌకర్యం అందిస్తున్నామన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, టిఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు పెద్ది సుదర్శన్‌రెడ్డి, నగర మేయర్ నన్నపనేని నరేందర్, జిల్లా పార్టీ అధ్యక్షులు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఎసిబి వలలో
పంచాయతీరాజ్ చేప
* రూ. 40వేలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ అధికారి
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, జూన్ 6: వరంగల్ జిల్లా తాడ్వాయి పంచాయతీరాజ్ ఎఈగా పనిచేస్తున్న జిపి కృష్ణ ఓ కాంట్రాక్టర్ వద్ద 40వేల లంచం తీసుకుంటూ సోమవారం రెడ్‌హ్యాండెడ్‌గా ఎసిబి పోలీసులకు పట్టుబడ్డాడు. ఎసిబి డిఎస్పీ సాయిబాబా తెలిపిన వివరాల ప్రకారం సమ్మక్క - సారలమ్మ జాతర సందర్భంగా రోడ్డు పనులు చేసిన కాంట్రాక్టర్ తిరుపతిరెడ్డికి ఫైనల్ బిల్లు రూ. 9 లక్షల రూపాయలు చెల్లించేందుకు గాను కాంట్రాక్టర్ తిరుపతిరెడ్డి నుండి 50వేల లంచం డిమాండ్ చేశాడు. పనులు ప్రారంభమైనప్పటి నుండి కూడా ఎఈకి డబ్బులు ముట్టచెప్పుతూ వస్తూనే ఉన్నాడు. ఫైనల్ బిల్లు కావడంతో మరో 50వేలు కావాలని డిమాండ్ చేయగా 40 వేలకు ఒప్పందం కుదుర్చుకొని కాంట్రాక్టర్ ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. తాడ్వాయి ఎఈగా పనిచేస్తున్న కృష్ణది హన్మకొండ కావడంతో ఫోన్ ద్వారా డబ్బులు తీసుకొచ్చానని ఎఈకి కాంట్రాక్టర్ చెప్పగానే వడ్డేపల్లి రోడ్డులో ఉన్న తేజశ్విని స్కూల్ వద్దకు రమ్మని చెప్పగా.. కాంట్రాక్టర్ వెళ్లి ఎఈకి డబ్బులు ఇస్తుండగా అప్పటికే అక్కడ ఉన్న ఎసిబి అధికారులు ఎఈని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకొని ఎఈని అరెస్టు చేసినట్లు ఎసిబి డిఎస్పీ వెల్లడించారు.

శాంతిభద్రతల పరిరక్షణలో
ప్రజల భాగస్వామ్యం
* పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు పిలుపు
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, జూన్ 6: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రజలు సైతం భాగస్వాములు కావాలని వరంగల్ పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు తెలిపారు. భద్రకాళీ దేవాలయంతో పాటు దేవాలయంలో పరిసర ప్రాంతాలలో ప్రజల భాగస్వామ్యంతో నూతనంగా నెలకోల్పిన సిసి కెమెరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సోమవారం ప్రారంభించారు. సేఫ్ అండ్ సెక్యూర్ నగరంగా గుర్తింపు సాధించడంలో భాగంగా భద్రకాళీ దేవస్థానంతో పాటు కెయంసి నుండి ఎంజిఎం క్రాస్ రోడ్ మరియు ఎంజిఎం క్రాస్ రోడ్ నుండి భద్రకాళీ దేవస్థానానికి వెళ్లే మార్గం, దేవస్థానంలో సుమారు 50 సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా భద్రకాళీ పరిసర ప్రాంతాలపై ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేయడంతో పాటు ముఖ్యమైన రోజుల్లో భద్రకాళీ దేవస్థానానికి వచ్చే భక్తుల భద్రతతో దేవస్థానానికి వచ్చే మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణ కొరకు సిసి కెమెరాలు ఏర్పాటు చేయబడ్డాయని, సిసి కెమెరాలను దృశ్యాలుగా ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వీలుగా భద్రకాళీ దేవస్థానంతో పాటు వరంగల్ ఏసిపి కార్యాలయంలో కమాండ్ కంట్రోల్‌రూంలను నెలకొల్పబడిందని కమిషనర్ తెలిపారు. విలేఖరుల సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ దేశం నలుమూలల నుండి భద్రకాళీ దేవస్థానానికి తరలివచ్చే భక్తులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందని, ఇందుకోసం సిసి కెమెరాల ఏర్పాటు చేయడం జరిగిందని, తెలంగాణలో తొలి స్మార్ట్ సిటీగా వరంగల్ నగరం ఎంపిక కావడం మన అదృష్టమని, దీనికి తగ్గట్లుగానే వరంగల్ నగరాన్ని స్మార్ట్ అండ్ సేఫ్ సిటీగా తయారు చేసుకోవాలని, అదే విధంగా సిసి కెమెరాల ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను అదుపు చేయడంతో పాటు నేరస్థులను గుర్తించడం సులభమవుతుందన్నారు.

మృత్యువులోనూ
వీడని స్నేహబంధం
* రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, జూన్ 6: ఇద్దరు ప్రాణస్నేహితులే. రోడ్డు ప్రమాద రూపంలో ఓ లారీ వీరిద్దరిని మింగేసింది. పల్సర్ బైక్‌పై వెళ్తున్న ఈ ఇద్దరు యువకులను లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సోమవారం వరంగల్ - హైదరాబాద్ జాతీయ రహదారిలోని మడికొండ వద్ద జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లా కేసముద్రం మండల కేంద్రానికి చెందిన నరేష్ (20) ట్రాలీడ్రైవర్, అదే మండలం ఇంటికనె్న గ్రామానికి చెందిన శ్రీనివాస్ (20) ఇద్దరు బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లి ఉంటున్నారు. ఈ నెల 4న హైదరాబాద్‌లో నరేష్ తన మిత్రుని బైక్ తీసుకొని కేసముద్రం వచ్చారు. తిరిగి సోమవారం హైదరాబాద్‌కు వెళ్తుండగా మడికొండ వద్ద ఈ సంఘటన జరిగింది. గతంలో ఎప్పుడూ కూడా బైక్ పైనే హైదరాబాద్ నుండి వారి సొంత ప్రాంతాలకు వచ్చేవారు. అయితే ఈసారి మాత్రం వరంగల్ మీదుగా హైదరాబాద్‌కు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. మడికొండ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

వైద్య శాఖలో కొలువుల జాతర
* త్వరలో 2వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్
* 50అంబులెన్స్ వాహనాలు మంజూరు
* పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తాం
* కాజీపేటలో 30 పడకల ఆస్పత్రి ఏర్పాటు
* వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, జూన్ 6: తెలంగాణ వ్యాప్తంగా వైద్యశాఖలో ఖాళీగా ఉన్న 2వేల పైచిలుకు ఉద్యోగాల నియామకాలకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి వెల్లడించారు. వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం అందించడమే సర్కార్ లక్ష్యమని, తదనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గత పాలకులు తెలంగాణ వైద్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత వైద్య ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. గతంలో ప్రభుత్వ ఆస్పత్రికి అంటేనే భయపడే వారని, ఇప్పుడారోజులు మారాయన్నారు. ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నామని అన్నారు. ఆస్పత్రుల్లో ఎవరైనా చనిపోయినట్లయితే వారిని వారి సొంత ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు వీలుగా ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో అంబులెన్స్ వాహనాన్ని ఏర్పాటు చేస్తున్నామని, అదే విధంగా డెలవరీకి వచ్చిన మహిళను కూడా సురక్షితంగా తల్లి, బిడ్డలను ఇంటికి చేర్చే బాధ్యత కూడా సర్కార్‌దేనని, అందుకోసం అమ్మ ఒడి పేరిట వాహనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 50 అంబులెన్స్ వాహనాలను మంజూరు చేశామని త్వరలోనే అవి ఉపయోగంలోకి వస్తాయన్నారు. గాంధీ ఆస్పత్రిలో 10 వాహనాలు, ఉస్మానియా ఆస్పత్రిలో మరో 10 వాహనాలను కేటాయించామని, ప్రతి జిల్లాకు రెండు చొప్పున వాహనాలను ఏర్పాటు చేస్తున్నట్లుతెలిపారు. విలేఖరుల సమావేశం అనంతరం హైదరాబాద్‌కు వెళ్తూ మార్గమధ్యంలో ఉన్న కాజీపేట మినీ మున్సిపల్ కాంప్లెక్స్‌లో ఉన్న సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అండ్ కార్యాలయ భవనాన్ని పరిశీలించారు. ఈ భవనంపై ఉన్న గదుల్లో 30 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ మంత్రిని కోరగా ఆయన అందుకు సానుకూలంగా స్పందించి త్వరలోనే ఇక్కడ ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని తెలిపారు. 2000సంవత్సరంలో జాతీయ ఆరోగ్య మిషన్ కింద రెఫరల్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు మంజూరు కాగా 2005 సంవత్సరంలో ప్రారంభించాల్సివుండగా అది కార్యరూపం దాల్చకుండా ఆగిపోయిందని, ఇప్పుడు అదే భవనంలో 30 పడకల ఆస్పత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. మంత్రి వెంట మేయర్ నన్నపనేని నరేందర్, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, కాళోజీ హెల్త్‌యూనివర్సిటీ డైరెక్టర్ కరుణాకర్‌రెడ్డి, రిజిష్టర్ వెంకటేశ్వర్‌రావు తదితరులు ఉన్నారు.

సాదాబైనామా ప్రక్రియ
గడువులోగా పూర్తిచేయాలి
బాలసముద్రం, జూన్ 6: జిల్లాలో సాదా బైనామా ప్రక్రియ నిర్ణీత వ్యవధిలో సమర్ధవంతంగా పూర్తి చేయాలని, తద్వారా రైతు పట్టాదారు పాస్‌బుక్ పొందాలని కలెక్టర్ వాకాటి కరుణ కోరారు. సోమవారం సాయంత్రం తహశీల్దార్లు, బ్యాంకు అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సాదా బైనామా, మీ పహాణీ - మీ కోసం మరియు పంటల బీమా అంశాలపై అమలు తీరును కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో సాదా బైనామా పరిధిలో గల రైతులందరినీ ఈ కార్యక్రమంలో కవర్ చేయాలన్నారు. ప్రభుత్వం కల్పించిన ఈ సువర్ణావకాశాన్ని రైతులకు ప్రయోజనం కలిగే విధంగా రెవెన్యూ అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. ప్రతి గ్రామంలో పి ఆర్ ఓ, ఐకెపి సిబ్బంది పూర్తి స్థాయిలో రైతుల నుండి దరఖాస్తు సేకరించి బల్క్‌గా తీసుకెళ్లి నిర్దేశించిన మీ సేవ కేంద్రంలో అందజేసి అప్‌లోడ్ చేయించాలన్నారు. కొన్ని గ్రామాల్లో దరఖాస్తులను మీ సేవ కేంద్రాల వారీగా కేటాయించి అప్‌లోడ్ ప్రక్రియ త్వరితగతిన జరిగేలా చూడాలన్నారు. ఈ అంశాన్ని సంబంధిత ఆర్‌డి ఓలు, తహసీల్దార్లు, మానిటరింగ్ చేయాలని సూచించారు. సాదా బైనామా రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 15వ తేదీ వరకే ఉన్నందున క్షేత్రస్థాయిలో పనిని వేగవంతం చేయాలన్నారు. ఎలాంటి ప్రలోభాలకు తావులేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని, మీ సేవ కేంద్రాలలో కూడా రిజిస్ట్రేషన్ నిమిత్తం నిర్ధేశించిన 35 రూపాయలు మాత్రమే వసూలు చేయాలని కలెక్టర్ సూచించారు. మీ పహాణీ - మీకోసం అంశాన్ని ప్రస్తావిస్తూ కలెక్టర్ గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి రైతులకు చైతన్యం కలిగించాలన్నారు. రైతులు పంట రుణాల కొరకు అధికారుల చుట్టూ, బ్యాంకర్ల చుట్టూ తిరిగే అవసరం లేకుండా రెవెన్యూ సిబ్బంది, బ్యాంకు అధికారులు సమన్వయంతో పని చేసి రైతులకు ఖరీఫ్ రుణాలను సకాలంలో అందజేయాలన్నారు. బ్యాంకు అధికారులకు డాక్యుమెంటేషన్ విషయంలో రెవెన్యూ సిబ్బంది సహకారాన్ని అందిస్తామన్నారు. పంటల బీమా గురించి కలెక్టర్ వివరిస్తూ ఈసారి జిల్లాలో బజాజ్ ఎలియాంజ్ నోడల్ ఏజెన్సీగా పంటల బీమా పథకాన్ని పర్యవేక్షిస్తున్నారని, రైతులలో ఈ అంశం పట్ల అవగాహన కలిగించాలన్నారు.

వైద్య, ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలి
గూడూరు, జూన్ 6: వర్షాకాలం ప్రారంభమైన క్రమంలో వైద్య, ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలను అందించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ఆదేశించారు. గూడూరు మండల కేంద్రంలోని అటవీ శాఖ అతిథి గృహంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి మాట్లాడారు. సీజనల్ వ్యాధులు దరి చేరకుండా ప్రజలు సైతం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రధానంగా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మలేరియా నివారణకు కృషి చేయాలని, అన్ని పిహెచ్‌సిలకు మలేరియా కిట్లను పంపించామని తెలిపారు. అయోధ్యాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి దాదాపు కోటి పైచిలుకు నిధులను త్వరలోనే మంజూరు చేస్తామని వెల్లడించారు. గూడూరు మండల కేంద్రంలో 4.5 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న సిహెచ్‌సి సెంటర్ భవన నిర్మాణ పనులు నాణ్యంగా నిర్మించడం లేదని స్థానిక టిఆర్‌ఎస్ నాయకులు మంత్రికి ఫిర్యాదు చేశారు. వెంటనే మంత్రి లక్ష్మారెడ్డి సిహెచ్‌సి నిర్మాణ పనులను పరిశీలించారు. క్వాలిటీ సెల్ అధికారులతో మాట్లాడారు. భవన నిర్మాణ పనులను పరిశీలించాలని ఆదేశించారు. నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్, టిఆర్‌ఎస్ జిల్లా నాయకులు బీరవెళ్లి భరత్‌కుమార్, బీరవెళ్లి వేణుగోపాల్‌రెడ్డి, దామెర నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.