వరంగల్

ప్రజారక్షణే ధ్యేయం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలసముద్రం, జూన్ 7: పోలీసు అధికారులు, సిబ్బంది ప్రజారక్షణే ధ్యేయంగా పని చేయాలని, పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం చేయాలని నార్త్‌జోన్ ఐజి నాగిరెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌హాలులో వరంగల్ రేంజ్ పరిధి సమీక్ష సమావేశంలో డిఐజి ప్రభాకర్‌రావు, ఖమ్మం ఎస్పీ షానవాజ్‌ఖాసీం, వరంగల్ రూరల్ అదనపు ఎస్పీ జాన్‌వెస్లీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐజి నాగిరెడ్డి మాట్లాడుతూ శాంతి భద్రతల పరంగా ఎన్ని ఒత్తుడులు వచ్చినా రాజీపడవద్దని, బాధితులకు న్యాయం చేసేలా పోలీసుల అభిమతం ఉండాలన్నారు. వరంగల్ రూరల్, ఖమ్మం జిల్లాల శాంతి భద్రతల పరిస్థితి అడిగి తెలుసుకొని మవోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించాలని పోలీసు అధికారులకు సూచించారు. అలాగే రెండు జిల్లాల పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని ఐజి పేర్కొన్నారు. వరంగల్ రేంజ్ డిఐజి ప్రభాకర్‌రావు మాట్లాడుతూ పోలీసు అధికారులు, సిబ్బంది ప్రజలతో హుందాగా ప్రవర్తించి ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయాలన్నారు. అలాగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రజల్ని ఇబ్బందులకు గురిచేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని అన్నారు. అంతకుముందు నార్త్‌జోన్ ఐజిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా వరంగల్‌కు వచ్చిన ఐజి నాగిరెడ్డికి సాయుధ పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం డిఐజి ప్రభాకర్‌రావు, సిపి సుధీర్‌బాబు, ఖమ్మం ఎస్పీ షానవాజ్‌ఖాసీం, వరంగల్ రూరల్ ఎస్పీ జాన్ వెస్లీ, ములుగు ఏఎస్పీ విశ్వజిత్ కంపాటి, వరంగల్ రూరల్, ఖమ్మం జిల్లాకు చెందిన పోలీసు అధికారులు, పోలీసు అధికారుల సంఘం నేతలు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వరంగల్ రూరల్, ఖమ్మం జిల్లాకు చెందిన పోలీసు అధికారులు పాల్గొన్నారు.