వరంగల్

కోదండరాం విమర్శల వెనుక కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూన్ 7: టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లలోనే తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్న తరుణంలో ప్రభుత్వంపై పొలిటికల్ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం చేసిన విమర్శల వెనుకు కుట్ర దాగివుందని టిఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు అన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై మొదటి సారిగా మంగళవారం వరంగల్ నగరానికి చేరుకున్నారు. ముందుగా ఆయనకు నాయకులు, కార్యకర్తలు యూనివర్సిటీ రోడ్ వద్ద ఘనస్వాగతం పలికారు. అక్కడ ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్‌రావు, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు కెప్టెన్ లక్ష్మీకాంతారావు నివాళులు అర్పించి అక్కడి నుండి ర్యాలీగా అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ తరువాత అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్నారు. అక్కడ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించి అనంతరం మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ బంగారు తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడుతుంటే ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేయడాన్ని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన వారు, ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న వారే ప్రభుత్వంపై ఇలా విమర్శలు చేయడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని, ఈ కుట్రలను తిప్పికొడతామన్నారు. తెలంగాణకు రావలసిన నీటి వాటాను వదిలేది లేదన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా నెరవేరుస్తూ పథకాల అమలులో ఇతర రాష్ట్రాలకే ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. వచ్చే రెండేళ్లలో తెలంగాణను అన్ని రంగాల్లో అబివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నన్నపనేని నరేందర్, రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు పెద్దిసుదర్శన్‌రెడ్డి, సహోదర్‌రెడ్డి, గుడిమళ్ల రవికుమార్ పాల్గొన్నారు.