వరంగల్

మహిళా అడ్వకేట్‌పై సీనియర్ అడ్వకేట్ దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూన్ 7: జూనియర్ మహిళా అడ్వకేట్‌పై సీనియర్ అడ్వకేట్ తీవ్రంగా దాడి చేసిన సంఘటన మంగళవారం కాజీపేటలో చోటు చేసుకుంది. కాజీపేట ఎస్సై భీమేష్ తెలిపిన వివరాల ప్రకారం సిద్దార్థ నగర్‌లో ఉంటున్న దయాన్ శ్రీనివాస్ అనే అడ్వకేట్ వద్ద 30 సంవత్సరాల ఒక మహిళా జూనియర్ అడ్వకేట్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఈ మహిళా అడ్వకేట్ తనకు తెలిసిన అతని బైక్‌పై వెళ్తుండగా అడ్వకేట్ దయాన్ శ్రీనివాస్ చూశాడు. ఇది జీర్ణించుకోలేక కాజీపేట విష్ణుపురిలో ఉంటున్న జూనియర్ మహిళా అడ్వకేట్ వద్దకు వెళ్లి ఆమెను తన ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో విపరీతంగా కొట్టాడు. దీంతో జరిగిన విషయాన్ని జూనియర్ అడ్వకేట్ తన తల్లికి చెప్పుకోవడంతో హైదరాబాద్‌లో ఉన్న ఆమె తల్లి హుటాహుటిన ఇక్కడకు చేరుకొని అడ్వకేట్ దయాన్ శ్రీనివాస్‌పై కాజీపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భీమేష్ వెల్లడించారు.