క్రీడాభూమి

విండీస్‌కు వైట్‌వాష్ తప్పదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 2: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో వెస్టిండీస్ వైట్‌వాష్ వేయించుకునే ప్రమాదంలో పడింది. మొదటి టెస్టును ఇన్నింగ్స్ 212 పరుగుల భారీ తేడాతో కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా ఆతర్వాత రెండో టెస్టును 177 పరుగుల ఆధిక్యంతో సొంతం చేసుకుంది. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టులో పటిష్టమైన ఇంగ్లాండ్‌కు ఈ జట్టు ఎంత వరకూ ఎదురునిలిస్తుందనేది అనుమానంగానే ఉంది. మ్యాచ్‌ని కనీసం డ్రా చేసుకున్నా, వైట్‌వాష్ ప్రమాదం నుంచి బయటపడుతుంది. కానీ జాసన్ హోల్డర్ నాయకత్వంలోని విండీస్ అన్ని విభాగాల్లోనూ బలహీనంగా కనిపిస్తున్నది. క్రిస్ గేల్ వంటి చాలా మంది స్టార్ ఆటగాళ్లు బిగ్‌బాష్ క్రికెట్ టోర్నమెంట్‌లో ఆడుతున్న నేపథ్యంలో, అంతర్జాతీయ క్రికెట్‌లో అంతగా అనుభవం లేని వారే ప్రస్తుతం ఆసీస్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్నది. పూర్తి స్థాయి విండీస్ జట్టు బరిలోకి దిగితేనే ఆసీస్‌ను నిలువరించడం కష్టం. అలాంటిది దాదాపుగా ద్వితీయ శ్రేణి జట్టుగా కనిపిస్తున్న హోల్డర్ బృందం అద్భుతాలను సాధిస్తుందని ఊహించడం కూడా కష్టమే. చివరి మ్యాచ్‌ని కూడా గెల్చుకోవడం ద్వారా క్లీన్‌స్వీప్ చేయాలని ఆస్ట్రేలియా పట్టుదలతో ఉండగా, ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలన్న అంశంపై విండీస్ జట్టు మేనేజ్‌మెంట్ వ్యూహరచన చేస్తున్నది. (చిత్రం) విండీస్ క్రికెటర్ల ప్రాక్టీస్ సెషన్