మెదక్

సమాజ మార్పుతోనే లింగ వివక్షకు అంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, మార్చి 8: మహిళలు ఓటుహక్కు, సమానత్వం, పనికి తగ్గ వేతనాల కోసం ఉద్యమించి విజయం సాధించారని టిజెఎసి చైర్మన్ ప్రొ. కోదండరాం అన్నారు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో ఓటుహక్కు, సమానత్వం కోసం ఉద్యమించి విజయం సాధించినా సమాజంలో మహిళల పై వివక్ష కొనసాగిందన్నారు. సమాజంలో లింగ వివక్షకు వ్యతిరేకంగానే నేటి మహిళా లోకం ఉద్యమిస్తుందన్నారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం పురస్కరించుకొని మెదక్ జిల్లా సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం తెలంగాణ విద్యావంతుల వేదిక, టిఎన్జీఓ, టిపిటిఎఫ్, టిటిఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళలకు రాజకీయ చైతన్యం వచ్చినప్పుడే పురుషులతో సమాన హక్కు వస్తుందన్నారు. మహిళలకు ఆర్థిక స్వావలంభనతోనే గుర్తింపు లభిస్తుందన్నారు. అందుకే మహిళలు రాజకీయ స్వాతంత్య్రం కోసం పోరాటం చేశారని గుర్తుచేశారు. సాంప్రదాయ సమాజం నుంచి ఆధునిక సమాజం ఆవిర్భవిస్తున్నప్పుడే స్ర్తిలకు సమానత్వం అనే ఆంశం తెరమీదికి వస్తుందన్నారు. సామాజిక ఉద్యమాల్లో భాగస్వాములై స్ర్తిలు హక్కుల కోసం ఉద్యమించారన్నారు. విద్య, ఉద్యోగాల్లో సమాన అవకాశాలు కల్పించినప్పుడే స్ర్తిలకు మంచి గుర్తింపు వస్తుందన్నారు. గతంలో కంటే ప్రస్తుత పరిస్తితుల్లో సమాజంలో మార్పు వచ్చిందని, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నారు. ఏ రంగంలోనైనా లింగ వివక్ష కొనసాగుతుందని, దీన్ని పూర్తిగా అంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో మార్పు వచ్చినప్పుడే లింగ వివక్ష అంతమైతుందన్నారు. స్ర్తిలు చేసిన పనులకు సైతం తగిన గుర్తింపు లభించలేదన్నారు. మహిళల పై ఇంట, బయట ఇంకా తీవ్ర హింస కొనసాగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రపంచమంతా లింగ సమానత్వం కోసం పోరాడుతుందని, లింగ వివక్ష పోయి లింగ సమానత్వం రావాలన్నారు. టివివి మహిళ విభాగం అధ్యక్షురాలు ప్రొ.రమ, రాష్ట్ర కార్యదర్శి జగదీష్, యాదయ్య, జిల్లా అధ్యక్షుడు రాజు, సువర్ణ, శే్వత, వజ్రమ్మ, నాయకులు పాపయ్య, తిరుపతిరెడ్డి, రాములు పాల్గొన్నారు.