హైదరాబాద్

నిర్దేశిత సమయానికి బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాదర్‌ఘాట్, ఏప్రిల్ 4: నిర్దేశిత సమయాల్లో బస్సులు బయలుదేరేందుకు టిఎస్ ఆర్టీసీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. గత కొన్ని రోజులుగా మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌నుండి జిల్లా బస్సులు సరైన వేళల్లో బయలుదేరడం లేదంటూ వచ్చిన వరుస ఫిర్యాదుల పిమ్మట అధికారులు ఈ విధమైన చర్యలు చేపట్టారు. నిత్యం 3800 బస్సులు ఎంజిబిఎస్ కేంద్రంగా రాకపోకలు చేస్తుంటాయి. ఇతర ప్రాంతాలనుండి ఇక్కడకు చేరుకునే బస్సు సర్వీసులు కొన్ని సందర్భాల్లో గంటల తరబడి ఆలస్యమవుతున్నాయి. దీంతో సగటు ప్రయాణీకుడు ప్రయాణ సమయాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ జామ్‌లు తదితరాల్లో కూడా బస్సులు సరైన మార్గనిర్దేశానికి అనుగుణంగా ప్లాట్‌ఫామ్‌లపైకి వచ్చి చేరలేకపోతున్నాయి. విజయవాడ, షిరిడీ, విశాఖపట్నం, బెంగుళూరు తదితర ప్రదేశాలకు కొన్ని మార్లు బస్సు సర్వీసులు సకాలంలో బయలుదేరకపోవడానికి కారణం నిర్దేశిత సమయానికి బస్సులు ప్లాట్‌ఫాంపైకి రాకపోవడమే అని అధికారులు గుర్తించారు. ప్రయాణీకుల మనుగడపై పూర్తి దృష్టి సారించిన అధికారులు బస్సులను ఆయా ప్రాంతాలకు సమయానికి బయలుదేరేలా చర్యలు చేపట్టారు. ఇతర ప్రాంతాల బస్సులు ఒకవేళ ఎంజిబిఎస్‌కు చేరుకోవడానికి ఆలస్యమైతే వెంటనే మరో బస్సును సమకూర్చి నిర్దేశిత సమయానికి బస్సులు బయలుదేరేలా చేయనున్నారు. ప్రయాణీకులు ప్రైవేటు ఆపరేటర్లపై ఆధారపడకుండా వుండేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని అధికారులు అంటున్నారు. రద్దీమేరకు అవసరమైతే ప్రత్యేక బస్సులను నడిపించినా అదనపు చార్జీలు వడ్డించాలా వద్దా అని అధికారులు ఆలోచిస్తున్నారు. ఆదరణే ముఖ్యంగా కొద్దిమేర నష్టం వాటిల్లినా అవసరాలకు అనుగుణంగా ప్రయాణీకులను ప్రైవేటు ఆపరేటర్ల బారిన పడకుండా వుండేందుకు మరిన్ని సత్వర సేవలు అందించే వీలు కల్పించేందుకు కసరత్తులు చేయనున్నట్టు అధికారులు తెలిపారు.వేసవి దృష్ట్యా పలు ప్రదేశాలకు అదనపు బస్సు సర్వీసులను నడుపుతున్నట్టు అసిస్టెంట్ ట్రాపిక్ మేనేజర్ రాఘవేంద్రరెడ్డి తెలిపారు.