జాతీయ వార్తలు

యడ్డీ వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: భూకబ్జాలు, పలు అవినీతి వ్యవహారాల్లో జైలుకి వెళ్లి వచ్చిన కర్నాటక బిజెపి అధ్యక్షడు, మాజీ సిఎం యడ్యూరప్పకు కాంగ్రెస్‌ను విమర్శించే నైతిక హక్కు లేదని యూత్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నాటకలో కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తానంటూ యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు శనివారం ఇక్కడ ధర్నా జరిపారు. అవినీతి పరుడైన యడ్యూరప్పను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం చూస్తుంటే బిజెపికి ఎలాంటి విలువలు లేవని అర్థమవుతోందని వారు విమర్శించారు.