జాతీయ వార్తలు

జికా వైరస్‌కు హైదరాబాద్‌లో మందు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రస్తుతం దేశదేశాలను వణికిస్తున్న జికా వైరస్‌కు తొలి వ్యాక్సిన్‌ను రూపొందించినట్లు నగరంలోని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ల్యాబ్ శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తున్న ఈ వైరస్‌కు మందు కనుగొనాలని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ విజ్ఞప్తి చేసింది. దోమల ద్వారా, లైంగిక చర్యల ద్వారా వ్యాపించే జికా వైరస్‌కు తాము ఇటీవలే వాక్సిన్‌ను కనుగొన్నామని, ఇప్పటికే పేటెంట్ తీసుకున్నట్లు భారత్ బయోటెక్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. అవసరమైన అన్ని అనుమతులు లభిస్తే నాలుగు నెలల్లో పదిలక్షల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తామని వారు అంటున్నారు. వ్యాక్సిన్‌ను వివిధ స్థాయిల్లో పరిశీలించాక ప్రభుత్వ అనుమతి లభిస్తే భారత్‌కు ప్రపంచంలోనే అరుదైన ఘనత దక్కే అవకాశం ఉంది.