జాతీయ వార్తలు

ఉగ్రవాదాన్ని ఉపేక్షించవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: రష్యాలోని పోర్ట్‌సిటీ సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన పేలుళ్లపై రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని అణచివేయడానికి అందరూ ముందుకురావాలని మంగళవారం ఆయన పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై అత్యవసర, సమగ్ర చర్యలు తీసుకోవల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించిన ప్రణబ్ ముఖర్జీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్‌కు ఓ సందేశం పంపారు. కష్టాల్లో ఉన్న రష్యాకు భారత్ ప్రజల తరఫున రాష్టప్రతి సంఘీభావం తెలిపారు.