మెదక్

ఖేడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణఖేడ్, జనవరి 20: నారాయణఖేడ్ శాసన సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో అకాలమరణం పొందిన దివంగత ఎమ్మెల్యే కిష్టారెడ్డి కుమారుడు ఎంపిపి పి,సంజీవరెడ్డి బుధవారంనాడు నారాయణఖేడ్ తహశీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లకు తన నామినేషన్ అందించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. తండ్రి కిష్టారెడ్డి అకాల మరణంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సంజీవరెడ్డికి టిక్కెట్ ఇస్తున్నట్తు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏకగ్రీవం చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం అధికార పక్షంతో ప్రయత్నించినా వారు పట్టించుకోకపోవడంతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం సిద్ధం చేసుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహించేందుకు షేడ్యూల్ విడుదల చేయడంతో అన్ని పార్టీలకు చెందిన నాయకులు పోటీకి సిద్ధమై నామినేషన్లు వేసేందుకు తేదీలను ఖారారు చేసుకుంటున్నారు. సంజీవరెడ్డి చిన్న పిల్లల డాక్టర్, చదువుకున్నారు. నారాయణఖేడ్ మండలానికి జడ్పీటిసి సభ్యునిగా ఐదు సంవత్సరాలు పని చేశారు. జిల్లా ప్లానింగ్ కమిటీ సభ్యులుగానూ పనిచేశారు. ప్రస్తుతం ఖేడ్ మండలం ఎంపిపి అధ్యక్షడిగా ఉన్నారు. వారి ఇంటి నుంచి కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు. అయన వెంట విఠల్‌రెడ్డి శంకరయ్యస్వామి, అనంద్‌శెట్కార్, వీరారెడ్డి తదితరులున్నారు.

‘మిషన్ భగీరథ’ ఓ వరం

గవర్నర్ నరసింహన్ కితాబు
కొండపాక, జనవరి 20: మిషన్ భగీరథ పథకం ప్రజలకు వరం లాంటిదని, స్వచ్ఛమైన నీరు అందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న మహత్తర కార్యక్రమమని గవర్నర్ నరసింహన్ అన్నారు. బుధవారం కొండపాక మండలం వెలికట్ట గ్రామ పంచాయతీ మధిర రవీంద్రనగర్ వద్ద చేపడుతున్న వాటర్‌గ్రిడ్ పనులను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. వాటర్‌గ్రిడ్ పనులు పూర్తిఅయితే ప్రజలకు స్వచ్ఛమైన, శుద్ధిఅయిన మంచి నీరు లభిస్తుందన్నారు. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించిందన్నారు. చాలా కాలంగా తాగునీటికి ఇబ్బంది పడుతున్న ప్రజలకు దీంతో అవస్థలు తొలగిపోనున్నాయన్నారు. ప్రజలు కూడా నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించారు. మంచి కార్యక్రమానికి ప్రజల సహకారం కూడా ఉండాలన్నారు. ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలి, ప్రభుత్వం ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించినప్పుడే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. వాటర్‌గ్రిడ్ ద్వారా ఇక్కడి ప్రజలకు తాగునీటి సమస్య ఉండదన్నారు. గవర్నర్ నరసింహన్‌కు కలెక్టర్ రోనాల్డ్‌రోస్, అధికారులు పనులను వివరించారు. వాటర్‌గ్రిడ్ ద్వారా పైప్‌లైన్ ఏవిధంగా వేయడం జరుగుతుందో, నల్లా కనెక్షన్లు ఇచ్చి ప్రజలకు నీరు అందించే విధానాన్ని గవర్నర్‌కు వివరించారు. రవీంద్ర నగర్‌లోని కోడెల బాగయ్య, కనకయ్యల ఇళ్లలోనికి వెళ్లి నల్లాకనెక్షన్‌లను పరిశీలించారు. నల్లాలను బయట కాకుండా ఇంట్లో అమర్చుకోవాలని గవర్నర్ వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సుమతి, ఆర్డీఓ ముత్యంరెడ్డి, గడా అధికారి హనుమంతరావు, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.

బల్దియా పోరు..అభ్యర్థుల ప్రచార జోరు

పటన్‌చెరు, జనవరి 20: జిఎచ్‌ఎంసి ఎన్నికల నేపధ్యంలో బుధవారం నుండి ప్రచారం ఊపందుకుంది. పటన్‌చెరు, రామచంద్రాపురం, భారతినగర్ మూడు డివిజన్ల పరిధిలో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేసారు. గెలుపు కోసం నానా తిప్పలు పడుతున్నారు. పటన్‌చెరు పట్టణంలో కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు శంకర్‌యాదవ్ శాంతినగర్‌లో ప్రచారం కొనసాగించారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్ల కోసం కాలనీవాసులను వేడుకున్నారు. పట్టణంలోని పలు కాలనీలలో పారిశుద్ధ్యం పూర్తిగా లోపించిందని ఆవేదన వెలుబుచ్చారు. గ్రామ పంచాయతి ఉన్న పటన్‌చెరు గ్రేటర్ హైద్రాబాద్ మహానగరంలో విలీనమైన తరువాత ప్రజల ఇబ్బందులు తీవ్రమైనాయని అన్నారు. జిఎచ్‌ఎంసి సిబ్బంది కనీసం మోరీలు సైతం తీయడం లేదని కాలనీవాసులతో ఆయన విచారం వెలుబుచ్చారు. తనకు ఒకసారి అవకాశం ఇచ్చినట్లైయితే పటన్‌చెరు పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వౌలిక వసతులు కల్పించడానికి కృషి చేస్తానని అన్నారు. టిఆర్‌ఎస్ అభ్యర్థి కుమార్‌యాదవ్ పట్టణంలోని గౌతంనగర్‌లో పర్యటించారు. కాలనీలో పాదయాత్ర నిర్వహించిన ఆయన ఓటర్లందరిని పేరు పేరున పలకరించారు. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సహకారంతో ప్రజలకు అవసరమైన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. టిఆర్‌ఎస్ నాయకులు రామచంద్రారెడ్డి, కంకర శ్రీనివాస్ తదితరులతో కలిసి ప్రతిఒక్కరినీ కలిసిన ఆయన కార్పొరేటర్‌గా అవకాశం కల్పించాలని కోరారు. టిడిపి అభ్యర్థి మెట్టుకుమార్‌యాదవ్ గోకుల్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ మందుమూల సఫానదేవ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు విశ్వనాధం తదితరులతో కలిసి పర్యటించిన ఆయన ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్గించాలని వేడుకున్నారు. అధికార టిఆర్‌ఎస్ పార్టీ ఇంతకాలం చేసింది ఏమి లేదన్నారు. నగర మేయర్‌గా అవకాశం ఇస్తే అభివృద్ధి పనులు ముమ్మరం చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్న ప్రభుత్వం గత 18 మాసాలుగా చేసింది ఏమిటో బహిర్గత పరచాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

నేతల ప్రచార హోరు
రామచంద్రాపురం, జనవరి 20: భారతినగర్ 111వ డివిజన్ టిఆర్‌ఎస్ అభ్యర్థి సింధూరెడ్డి ప్రచారానికి మద్దతుగా ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహీపాల్‌రెడ్డిలు బుధవారం ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం 18మాసాలుగా విద్యుత్ సమస్య తలెత్తకుండా, తాగునీటి సమస్యను పరిష్కరిస్తూ, నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించిందన్నారు. అభివృద్ధిని కాంక్షిస్తూ టిఆర్‌ఎస్ అభ్యర్థి సింధూరెడ్డిని గెలిపించాలని కోరారు.
బిజెపి ప్రచారం
భారతినగర్‌లోని 111వ డివిజన్‌లో టిడిపి-బిజెపిల ఉమ్మడి అభ్యర్థి గోదావరి అంజిరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎస్‌ఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను చేపడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటున్న తమను బలపర్చాలని కోరారు. ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న తమకు టిడిపి శ్రేణులు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండే తమకు అవకాశం కల్పించాలన్నారు. ప్రచారంలో వనజ, నర్సమ్మ, రాజు, ప్రభు, రాగం భిక్షపతి తదితరులు ఉన్నారు.
ఆర్‌సి పురంలో ..
112 డివిజన్ టిఆర్‌ఎస్ అభ్యర్థి తొంట అంజయ్య యాదవ్‌ను ప్రకటించడంతో పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. డివిజన్ పరిధిలోని ప్రజలు అభివృద్ధిని తన అభ్యర్థ్వన్ని బలపర్చాలని కోరారు.
రోడ్డు భద్రత వారోత్సవాలు ఆరంభం

* జిల్లా కేంద్రంలో అవగాహనార్యాలీ
సంగారెడ్డి టౌన్, జనవరి 20: ట్రాఫిక్ చట్టాలు, నియమ నిబంధనలను పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని ఎఎస్పీ వెంకన్న సూచించారు. రవాణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 27వ రోడ్డు భద్రత వారోత్సవాలను మంగళవారం స్థానిక ఐబి అతిధి గృహం ముందు ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పట్టణంలో రోడ్డు భద్రతపై అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఎస్పీ మాట్లాడుతూ మత్తు పానీయాలకు దూరంగా ఉంటూ, తగిన విశ్రాంతి తీసుకొని డ్రైవింగ్ చేయాలని సూచించారు. రవాణా శాఖ ఉప కమిషనర్ రమేష్ మాట్లాడుతూ ఈ నెల 20నుంచి 26వ తేదీ వరకు వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. రోడ్డు భద్రతపై ఈ నెల 23న విద్యార్థులకు భద్రత అంశంపై వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 24న చరిత ఆసుపత్రి ఆధ్వర్యంలో డ్రైవర్లకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కంటిచూపు, బిపి, షుగర్ తదితర పరీక్షలను ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని డ్రైవర్లలందరూ సద్వీనియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పట్టణ సిఐ ఆంజనేయులు, ఆర్టీసి యూనియన్ నాయకులు, డ్రైవర్లు పాల్గొన్నారు.

సిఎం, మంత్రి ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం
నంగునూరు, జనవరి 20: మండలంలోని నర్మెటలో బుధవారం సిఎం కెసిఆర్, మంత్రి హరీష్‌రావు ఫ్లెక్సిలకు టిఆర్‌ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వానలు లేక భూగర్భ జలాలు రోజురోజుకు క్షీణించిపోవడం వల్ల బోర్లు, బావులు ఎండిపోవడంతో వ్యవసాయం చేయడమే కష్టమైతుందన్నారు. టిఆర్‌ఎస్ సర్కార్ రైతు సంక్షేమం కోసం తపాస్‌పల్లి డ్యాం నింపడమే కాక ఎడమ కాల్వద్వారా బందారం, అంకిరెడ్డిపల్లి, దర్గా పెద్దచెరువులను నింపాలని నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. సర్పంచు గాలవ్వ, టిఆర్‌ఎస్ నేతలు నారాయణ, ధనిరాజ్, కనకయ్య, శ్రీనివాస్, రవీందర్‌రెడ్డి, చంద్రం, శేఖర్, నర్సింలు, బిక్షపతి పాల్గొన్నారు.
నారాయణఖేడ్‌లో
టిఆర్‌ఎస్ విజయం తథ్యం
* జడ్పీ వైస్ చైర్మన్ సారయ్య
నంగునూరు, జనవరి 20: నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయమని జడ్పివైస్ చైర్మన్ సారయ్య ధీమా వ్యక్తం చేశారు. బుధవారం పాలమాకులలో విలేఖర్లతో మాట్లాడుతూ నారాయణఖేడ్ నియోజకవర్గం అభివృద్ధిలో ఎంతో వెనుకబడి ఉందన్నారు.
ఇప్పటివరకు అక్కడ ఎన్నికైన నేతలు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని, ఖేడ్ ఎన్నికల బాధ్యత మంత్రి హరీష్‌రావుకు అప్పగించడంతో గెలుపుఖాయంతో పాటు అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ సమావేశంలో ఎంపిపి శ్రీకాంత్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, ప్రణాళిక సంఘం సభ్యుడు మల్లయ్య, సొసైటి చైర్మన్లు రమేశ్‌గౌడ్, సోమిరెడ్డి, సర్పంచు రవీందర్‌రెడ్డి, విద్యానాయక్ పాల్గొన్నారు.

ఏడుగురు అదృశ్యం
* ఆత్మహత్య చేసుకున్నారని
అనుమానం

రామచంద్రాపురం, జనవరి 20: వ్యాపారంలో వచ్చిన నష్టాలతో కలత చెందిన ఒక కుటుంబం దైవ దర్శనానికి వెళ్లి అదృశ్యమైన ఘటన బుధవారం వెలుగు చూసింది. ఎస్‌ఐ ప్రవీన్‌రెడ్డి కథనం ప్రకారం అమీన్‌పూర్ పరిధిలోని లింగమయ్య కాలనీలో నివాసం ఉంటున్న గంద భూమయ్య స్థానికంగా బట్టల వ్యాపారం నిర్వహించే వారు. వ్యాపారంలో నష్టం రావడంతో కలత చెందిన కుటుంబ సభ్యులు ఈ నెల 16న శ్రీకాళాహస్తికి ప్రయాణమైనారు. భార్య నాగమణి, కుమారులు అనిల్, హన్మంతు, కోడలు సురేఖ, మనుమలు ఆయుష్, ఆకాష్‌లతో కలిసి వెళ్లిన వీరు తిరిగి రాకపోవడం, ఫోన్లు పని చేయకపోవడంతో ఆందోళన చెందిన భూమయ్య కూతురు అంజలి పుట్టింటికి చేరుకుంది. ఇంట్లోకి వెళ్లి చూడగ వ్యాపారంలో వరుసగా నష్టాలు రావడంతో సాముహికంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖ రాయడంతో పాటు ఇంటిని విక్రయించి అప్పులు తీర్చాలని కోరినట్లు తెలిపారు. కూతురు అంజలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

గవర్నర్‌కు ఘనస్వాగతం
గజ్వేల్, జనవరి 20: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని గవర్నర్ నరసింహ్మన్ మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని కోమటిబండలో బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్‌తో పాటు మిషన్ భగీరథ అధికారులు ఘనస్వాగతం పలికారు. గజ్వేల్ - తూప్రాన్ రోడ్డులో కోమటిబండ శివారుకు గవర్నర్ హెలిక్యాప్టర్‌లో రాగా, అక్కడినుండి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో కోమటిబండ గుట్టపై నిర్మిస్తున్న మిషన్ భగీరథ సంపౌజ్, ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణ పనులు జరిగే స్థలానికి చేరుకున్నారు. అయితే మిషన్ భగీరథ సెక్రటరీ ఆర్‌పి సింగ్, ఇఎన్‌సి సురేందర్‌రెడ్డి, ఎస్‌ఇ విజయ్‌ప్రకాశ్‌లు పథకం పనితీరు, చేపడుతున్న నిర్మాణ పనులగూర్చి వివరించారు. జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్, గఢా అధికారి హన్మంతరావు, ఆర్‌డిఓ ముత్యంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, వైస్ చైర్మన్ దుంబాల అరుణభూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అడుగడుగునా పోలీసుల తనిఖీలు
కోమటిబండ అటవి ప్రాంతంలో మిషన్‌భగీరథ నిర్మాణ పనులు జరుగుతుండడం, ఆ పనులను పరిశీలించేందుకు రాష్ట్ర గవర్నర్ నరసింహ్మన్ రావడంతో పోలీసులు అడుగడుగునా తనిఖీలు చేపట్టారు. డిఎస్‌పి శ్రీ్ధర్ నేతృత్వంలో బందోబస్తు ఏర్పాటు చేయగా స్పెషల్ బాంబ్ స్క్వాడ్‌లను దారిపొడవునా తనిఖీలు చేయడం కనిపించింది.