జాతీయ వార్తలు

ఆధార్ చివరి గడువు 30

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: ఈ నెల 30లోగా ఆధార్‌తో అనుసంధానం కాని బ్యాంకు ఖాతాలను అధికారులు మూసివేసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా 2014 జూలై 2015 తెరిచిన బ్యాంకు ఖాతాలను ఆధార్ నెంబర్‌తో ఏప్రిల్ 30లోగా ఆధార్‌తో అనుసంధానం చేయాల్సి ఉంటుందని ఆదాయం పన్ను విభాగం తెలిపింది. ఈ కొత్త గడువులోగా వినియోగదారులు ఆధార్ నెంబర్లు ఇవ్వకపోయినా, స్వయంగా తమ ఖాతాలను నిర్ధారించుకోక పోయినా వాటిని నిలిపివేసే అధికారం బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలకు ఉంటుందని ఆదాయం పన్ను విభాగం తెలిపింది. విదేశీ పన్నుల అమలు చట్టం పరిధిలోకి వచ్చే ఖాతాలకు ఇది వర్తిస్తుందని తెలిపింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన వివరాలను ఖాతాదారుల నుంచి సేకరించాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అధికారులు కోరారు.