జాతీయ వార్తలు

శశికళ ఔట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దినకరన్‌కు ఉద్వాసన.. అన్నాడిఎంకె సంచలన నిర్ణయం

మంత్రులు, ఎంపీల ఏకగ్రీవ తీర్మానం
పంతం నెగ్గించుకున్న పన్నీర్‌సెల్వం
ఇక విలీనమే తరువాయ
తమిళనాట వేగంగా మారిన రాజకీయం
ఈసీ నిర్ణయం తర్వాత చిన్నమ్మపై అధికారికంగా వేటు

చెన్నై, ఏప్రిల్ 18: తమిళనాడులోని అధికార అన్నాడిఎంకె మరోసారి ఆకస్మిక, సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ, ఆమె సమీప బంధువు టిటివి దినకరన్‌లకు ఉద్వాసన పలకాలని ముఖ్యమంత్రి పళనిస్వామి సారథ్యంలోని అధికార వర్గం ఏకగ్రీవంగా నిర్ణయించింది. దినకరన్‌ను పార్టీ పదవుల నుంచి ఇతర బాధ్యతల నుంచి తొలగించినప్పటికీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ఎన్నికల కమిషన్ పరిశీలనలో ఉన్నందున ఆమెను నామమాత్రంగానే పదవిలో ఉంచినట్టు స్పష్టమవుతుంది. ఈసీ నిర్ణయం వెలువడిన తర్వాత ఆమెను పూర్తిగా పార్టీ నుంచి తప్పించే అవకాశం కనిపిస్తోంది. పార్టీ నుంచి శశికళ, దినకరన్ కుటుంబాలను తప్పించే పక్షంలోనే విలీనానికి సిద్ధమంటూ మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం చేసిన డిమాండ్‌ను అధికార కూటమి తాజా నిర్ణయంతో సంతృప్తిపరిచినట్టయింది. దీని ఫలితంగా ఇరు వర్గాలు ఏకమై అన్నాడిఎంకె మళ్లీ ఒక్కతాటిపై నడిచే అవకాశం కనిపిస్తోంది. దినకరన్ ఆయన కుటుంబాన్ని పక్కన పెట్టాలని ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఏకగ్రీవ తీర్మానం ద్వారా నిర్ణయించారని రాష్ట్ర మంత్రి డి.జయకుమార్ మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత తెలిపారు. ఇంతకు ముందు ఆయన ముఖ్యమంత్రి పళనిస్వామిని కలుసుకుని తాజా పరిణామాలపై విస్తృతంగా చర్చించారు. పార్టీ దైనందిన వ్యవహారాలను నిర్వహించేందుకు ఓ ప్యానల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అన్నాడిఎంకె (అమ్మ)వర్గంతో పన్నీర్ సెల్వం వర్గం విలీనమైతే ప్రభుత్వంలో ఎలాంటి పరిణామాలు తలెత్తే అవకాశం ఉందన్నదానిపైనా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. తన వర్గాన్ని విలీనం చేసే పక్షంలో ముఖ్యమంత్రి పదవిని మళ్లీ చేపట్టాలని పన్నీర్‌సెల్వంపై ఆయన వర్గం వత్తిడి తెస్తోంది. అయితే ఈ విషయంలో పళనిస్వామి వర్గం ప్రతిస్పందన ఎలా ఉందన్నదానిపై ఎలాంటి సంకేతాలూ లేవు. మంగళవారం ఉదయం నుంచీ కూడా అధికార పార్టీలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోబోతున్నాయన్నదానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. శశికళను తప్పించాలన్న పన్నీర్‌సెల్వం డిమాండ్‌ను అంగీకరించేది లేదంటూ అధికార వర్గం తేల్చిచెప్పినట్టుగా కథనాలు వెలువడ్డాయి. అయితే రాత్రి పొద్దుపోయిన తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. పన్నీర్ ప్రధాన డిమాండ్‌ను అంగీకరించని పక్షంలో అన్నాడిఎంకె రెండు వర్గాలు విలీనమయ్యే అవకాశం లేదన్న విషయం తేలిపోవడంతో శశికళ, దినకరన్‌పై వేటు వేసినట్టుగా అధికార పార్టీ ఆకస్మికంగా ప్రకటించింది. ఇక పన్నీర్ సెల్వంతో విలీన చర్చలు ఏ ప్రాతిపదికన జరపాలన్నదానిపై దృష్టి సారిస్తామని మంత్రి జయకుమార్ తెలిపారు. రెండాకుల గుర్తును తమ వర్గానికే కేటాయించాలని కోరుతూ ఎన్నికల కమిషన్ అధికారులకే లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారన్న ఆరోపణల నేపథ్యంలో దినకరన్‌పై ఎఫ్‌ఐఆర్ దాఖలు కావడంతో ఒక్కసారిగా పరిస్థితి వేడెక్కింది. సోమవారం అర్ధరాత్రి వరకూ జరిగిన సమావేశానికి కొనసాగింపుగా మంగళవారమూ అధికార అన్నాడిఎంకె వర్గం విస్తృత మంతనాలు జరిపింది. జయలలిత మరణానంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు ఏకంగా ముఖ్యమంత్రి పదవినే చేపట్టాలని ప్రయత్నించిన ఆమె సన్నిహితురాలు శశికళకు ఇప్పుడు ఏదీ దక్కకుండా పోయింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రస్తుతం బెంగళూరు జైలులో ఉన్న శశికళకు ఇది ఆశనిపాతమే!