ఖమ్మం

రసకందాయంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, జనవరి 21: భద్రాచలం పట్టణంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల పోరు రసకందాయంలో పడింది. గతంలో ఏకగ్రీవానికి మొగ్గు చూపిన సభ్యులు ఇప్పుడు ఎన్నికకు పట్టుబట్టడంతో నువ్వా- నేనా అన్నట్లు పోరు సాగనుంది. అధ్యక్ష పోరులో ఆశావాహులు పోటీ పడుతుండటంతో బుధవారం సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తయ్యే నాటికి సభ్యత్వం తీసుకున్న వారి సంఖ్య 1100 వరకు చేరుకుంది. గతంలో ఎప్పుడూ ఏకగ్రీవంగానే ఎన్నిక జరిగేది. కానీ ఈసారి ఎన్నికలకు వ్యాపారులు సిద్ధపడటంతో బహుముఖ పోరుకు తెరలేచింది. గతంలో దీర్ఘకాలం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా పనిచేసిన చారుగుళ్ల దేవీప్రసాద్‌తో పాటుగా అజయ్‌కుమార్, కంభంపాటి సురేష్‌కుమార్, గేదెల శివశంకర్‌రావులు ప్రధానంగా అధ్యక్ష రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో వ్యాపారులంతా తమ తమ యూనియన్ల వారీగా సభ్యులను భారీగా చేర్పించి ఎన్నికలకు సిద్ధమయ్యారు. అధ్యక్ష అభ్యర్థులు ఆయా యూనియన్ల నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. హోటల్, లాడ్జీలు, వస్త్ర దుకాణాలు, ఐరన్ దుకాణాలు.. తమతమ యూనియన్ల నుంచి అభ్యర్థులను రేసులోకి దించుతున్నారు. ఇప్పటికే రాత్రి వేళల్లో సమావేశాలు నిర్వహించి ప్రచారాలు గుట్టుగా నిర్వహిస్తున్నారు. కేవలం 200 వరకు మాత్రమే పరిమితమైన సభ్యులు నేడు 1100లకు చేరుకోవడంతో పోటీ తీవ్రత అర్థమవుతోంది. మరోవైపు అభ్యర్థులు కొందరు అధికారులను ఉపయోగించి సభ్యులను బెదిరిస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఎన్నికల తేదీని మరో రెండుమూడు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల తేదీ ప్రకటిస్తే మరింత ఉత్కంఠ భరితంగా ఎన్నిక మారనుంది.
రోహిత్ ఆత్మహత్యకు కారకులపై చర్యలు తీసుకోవాలి
నేలకొండపల్లి, జనవరి 21: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు కారణమైన బిజెపి కేంద్ర మంత్రులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం పాలేరు అసెంబ్లీ యువజనకాంగ్రెస్ ఆధ్వర్యంలో అన్ని పాఠశాలల విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించి, స్థానిక పొట్టి శ్రీరాములు సెంటర్ వద్ద మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు బొంతు బొందయ్య మాట్లాడుతూ దేశంలో ప్రజల్లో చాలా అసహనం పెరిగిందని, విద్యార్థుల్లో కుల రాజకీయాలను పెంపొందిస్తున్నారన్నారు. బిజెపితో పాటు అనుబంధ సంస్థలైన ఏబివిపి విద్యార్థి సంఘం కూడా విద్యార్థులను విడదీసేందుకు చూస్తుందన్నారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు ఆదాం, బుచ్చాలు, నాగరాజు, రవి,శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఆత్మహత్యా యత్నం చేసిన
వివాహిత మృతి
తిరుమలాయపాలెం, జనవరి 21: కొద్దిరోజుల క్రితం ఆత్మహత్యా యత్నం చేసిన తెట్టెలపాడు గ్రామానికి చెందిన గండి వసంత(22) అనే వివాహిత బుధవారం రాత్రి మృతి చెం దింది. ఈ నెల 9వ తేదీన సెల్‌ఫోన్ కొనుగోలు విషయంలో భార్యాభర్తలకు మధ్య వివాదం జరగ్గా, భర్త మందలించాడు. దీంతో ఆమె ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నాటి నుంచి చికిత్స జరుగుతుండగా బుధవారం రాత్రి ఆమె మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మండల పరిధిలోని పిండిప్రోలు గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణా జిల్లాకు చెందిన ప్రేమ్‌చంద్(28) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం కృష్ణాజిల్లా కొండపల్లి మండలానికి చెందిన ప్రేమ్‌చంద్ తన స్నేహితులతో కలిసి టాటా ఎస్ వాహనంలో హన్మకొండ నుంచి వస్తుండగా పిండిప్రోలు గ్రామం వద్ద ఆగి ఉన్న ట్రిప్పర్‌ను వెనుక నుంచి ఢీకొట్టడంతో ప్రేమ్‌చంద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ప్రమాదంలో మరో వ్యక్తికి, డ్రైవర్‌కు గాయాలు కాగా, చికిత్స చేయిస్తున్నారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.