జాతీయ వార్తలు

‘హలో, నేను ఐఎస్‌ఐ ఏజెంట్‌ను’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: ‘హలో, నేను ఐఎస్‌ఐ ఏజెంట్‌ను. కాని, నేను ఇకముందు ఆ పని చేయాలని కోరుకోవడం లేదు. భారత్‌లో ఉండిపోవాలని కోరుకుంటున్నాను’ అని ఎయిర్ ఇండి యా విమానంలో దుబాయి నుంచి ఇక్కడి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న పాకిస్తాన్‌కు చెందిన ఒక వ్యక్తి శుక్రవారం ఇక్కడ చేసిన వ్యాఖ్యలివి. పాకిస్తాన్ పాస్‌పోర్ట్ కలిగి ఉన్న ముహమ్మద్ అహ్మద్ షేక్ ముహమ్మద్ రఫీక్ అనే ఈ వ్యక్తి విమానాశ్రయంలోని ఒక హెల్ప్ డెస్క్ వద్దకు వెళ్లి కౌంటర్‌లో ఉన్న ఒక మహిళను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐకి సంబంధించిన సమాచారాన్ని కూడా తాను తెలియజేస్తానని అతను చెప్పాడు. అతని మాట లు విని ఆశ్చర్యపోయిన ఆ మహిళ వెంటనే ఈ విషయాన్ని భద్రతాధికారులకు చెప్పారు. భద్రతాధికారులు వెంటనే రఫీక్‌ను అదుపులోకి తీసుకొని, కేంద్ర నిఘా సంస్థలకు సమాచారం చేరవేశారు. దుబాయి నుంచి ఇక్కడికి ఎయిరిండియా విమానంలో వచ్చిన 38 ఏళ్ల రఫీక్ ఇక్కడి నుంచి ఖాట్మండుకు వెళ్లడానికి టికెట్ కూడా బుక్ చేసుకొని ఉన్నాడు. అయితే తరువాత విమానమే ఎక్కకుండా బ్రేక్ జర్నీ చేయాలని నిర్ణయించుకున్నాడు. తరువాత విమానాశ్రయంలోని హెల్ప్ డెస్క్ కౌంటర్‌కు వెళ్లాడు.
భద్రతాధికారుల విచారణలో రఫీక్ తనకు ఐఎస్‌ఐతో సంబంధాలు ఉన్నాయని, అయితే తాను వాటిని మానుకోవాలని, భారత్‌లో ఉండిపోవాలని నిర్ణయించుకున్నానని చెప్పినట్లు అధికారులు తెలిపారు. అయితే భద్రతాధికారులు వెంటనే రఫీక్‌ను గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లారని, వేర్వేరు కేంద్ర నిఘా సంస్థలకు చెందిన అధికారులు అతడిని విచారిస్తున్నారని వారు తెలిపారు. రఫీక్ చెప్పిన విషయాలు సరయినవా? కావా? అనేది ధ్రువపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని వారు చెప్పారు.