జాతీయ వార్తలు

దేశంలో తగ్గిన ఆమ్యామ్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: దేశంలో ఆమ్యామ్యాలు (చిన్న మొత్తాల్లో జరిగే అవినీతి) బాగా తగ్గిందని, అయితే గత సంవత్సర కాలంలో కుటుంబాలు ప్రభుత్వ సేవలను పొందడానికి ఇచ్చిన లంచాల మొత్తం రూ. 6,350 కోట్లని ఒక తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ మొత్తంలో రూ. పది నుంచి ఇచ్చిన లంచాలు ఉన్నాయని తెలిపింది. సిఎంఎస్ ఇండియన్ కరప్షన్ స్టడీ (సిఎంఎస్-ఐసిఎస్) 2017 ప్రకారం, గత సంవత్సర కాలంలో సుమారు మూడో వంతు కుటుంబాలు ప్రభుత్వ సేవలు పొందడానికి కనీసం ఒక్కసారయినా లంచం ఇవ్వవలసి వచ్చింది. 2005లో 53 శాతం కుటుంబాలు ఇలా లంచం ఇవ్వవలసి వచ్చింది. 2017లో సర్వే చేసిన కుటుంబాల్లో కేవలం 43 శాతం కుటుంబాలే గత సంవత్సర కాలంలో ప్రజా సేవల్లో అవినీతి పెరిగిందని అభిప్రాయపడ్డాయి. 2005లో ప్రజాసేవల్లో అవినీతి పెరిగిందని 73 శాతం కుటుంబాలు పేర్కొన్నాయి. 2005తో పోలిస్తే పోలీస్, న్యాయ సేవల్లో అవినీతి గణనీయంగా తగ్గిందని తాజా అధ్యయనం వెల్లడించింది. దేశంలోని 20 రాష్ట్రాల్లో కుటుంబాలు 2017లో పది ప్రజా సేవలు పొందడానికి లంచం రూపంలో ఇచ్చిన మొత్తం రూ. 6,350 కోట్లుగా ఈ అధ్యయనం అంచనా వేసింది. 2005లో ఈ మొత్తం 20,500 కోట్లుగా పేర్కొంది. అనేక రాష్ట్రాల్లో లంచంగా ఇచ్చే మొత్తం రూ. వంద నుంచి రూ. 500 మధ్య ఉంటోంది. అయితే కుటుంబాలు కనీసంగా రూ. పది నుంచి గరిష్ఠంగా రూ. 50వేల వరకు ప్రజాసేవల కోసం లంచంగా ఇచ్చాయని సర్వే వెల్లడించింది.
కుటుంబాలు అందజేసిన వివరాల ప్రకారం, ప్రజాసేవల్లో లంచాలు పోలీసు శాఖలో 34 శాతం, భూమి/ఇళ్లకు సంబంధించి 24 శాతం, న్యాయ సేవలకు 18 శాతం, పన్ను శాఖలకు 15 శాతం, ప్రజా పంపిణీ వ్యవస్థకు 12 శాతంగా ఉన్నాయి. 20 రాష్ట్రాల్లోని 200కు పైగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన 3వేల కుటుంబాలను సర్వే చేశారు. 2005తో పోలిస్తే 2017 నాటికి అవినీతి ఖచ్చితంగా తగ్గిందని సర్వేలో పాల్గొన్న వారు అభిప్రాయపడటంతో పాటు తమ అనుభవాలు కూడా అదే చెబుతున్నాయని పేర్కొన్నారు.
గత సంవత్సర కాలంలో 20 రాష్ట్రాలకు గాను కర్ణాటకలో అవినీతి ఎక్కువగా 77 శాతం ఉందని, 74 శాతంతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని కుటుంబాల అనుభవాల ద్వారా తేలింది. తమిళనాడులో 68 శాతం, మహారాష్టల్రో 57 శాతం, జమ్మూకాశ్మీర్‌లో 44 శాతం, పంజాబ్‌లో 42 శాతం అవినీతి ఉన్నట్లు ఈ సర్వే వెల్లడించింది. కుటుంబాల అనుభవాల ద్వారా చాలా తక్కువ అవినీతి ఉన్న రాష్ట్రాలలో హిమాచల్‌ప్రదేశ్ (3శాతం), కేరళ (4శాతం), చత్తీస్‌గఢ్ (13 శాతం) ఉన్నాయి. 2005లో తక్కువ అవినీతి ఉన్న రాష్ట్రాలలో కేరళ (35 శాతం), మహారాష్ట్ర (39 శాతం), గుజరాత్ (43 శాతం) ఉన్నాయి.