అనంతపురం

పట్టణాల్లో కొత్త వెలుగులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం టౌన్, జనవరి 22: పట్టణాల్లో ఎల్‌ఇడి వెలుగులు విరజిమ్మేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్న నేపథ్యంలో జిల్లాలో తొలి విడతగా అనంతపురం నగర పాలక సంస్థతోపాటు హిందూపురం మున్సిపాలిటీ ఎల్‌ఇడి బల్బులు అమర్చే పనులు చురుగ్గా సాగుతున్నాయి. త్వరితగతిన పూర్తి చేసి ఈ నెలాఖరుకెల్లా ఎల్‌ఇడి వెలుగులను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఇంజినీరింగ్ విభాగం అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పట్టణంలో దాదాపు 50 శాతం మేరకు ఎల్‌ఇడి వీధి దీపాల అమరిక పూర్తయినట్లు తెలిపారు. అనంతపురం నగర పాలక సంస్థకు 9,940 ఎల్‌ఇడిలు, హిందూపురానికి 5505 ఎల్‌ఇడిలను సరఫరా చేశారు. అయితే పట్టణానికి మరో 3 వేల ఎల్‌ఇడిలు అవసరం ఉండగా వాటిని కూడా సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ సుముఖత వ్యక్తం చేసినట్లు అధికారులు తెలిపారు. ఎల్‌ఇడిల ఏర్పాటు ద్వారా 50 శాతం విద్యుత్ చార్జీలు ఆదా కానున్నాయి. ఎల్‌ఇడిల ఏర్పాటుకు అనంతపురం, హిందూపురం కమిషనర్లు నోయిడాకు చెందిన (ఇఇఎస్‌ఎల్) ఎనర్జీ ఎషిఫియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పంద మేరకు ప్రస్తుత విద్యుత్ చార్జీల్లో 50 శాతం తగ్గించే బాధ్యత ఇఇఎస్‌ఎల్‌దే. ఎల్‌ఇడిల ఏర్పాటుకు పురపాలక సంఘాలకు లక్షలాది రూపాయలు ఆదా కానుంది. అనంతపురంలో 10,134, హిందూపురంలో 6,555 వీధి దీపాలు ఉన్నాయి. అనంతపురంలో ప్రతినెలా విద్యుత్ చార్జీలు దాదాపు రూ.16-18 లక్షల దాకా వస్తుండగా హిందూపురంలో రూ.12 లక్షల వరకు వస్తోంది. ఇందులో 50 శాతం మాత్రమే విద్యుత్ బిల్లులు వచ్చేలా చూస్తామని సంస్థ రాత పూర్వకంగా కమిషనర్లకు తెలియజేసింది. ఎల్‌ఇడిల ఏర్పాటుతోపాటు ఏడేళ్ల పాటు నిర్వహణను ప్రైవేటు సంస్థే పర్యవేక్షించాల్సి ఉంటుంది. జియో ట్యాజింగ్ వ్యవస్థ, సెంట్రల్ సర్వర్ వ్యవస్థ ద్వారా పట్టణాల్లో ప్రతిలైటు వెలుగుతోందా లేదా అన్నది కంప్యూటర్ల ద్వారా పురపాలక సంఘ కార్యాలయాల్లోనే పర్యవేక్షణ చేసేలా ఏర్పాట్లు చేయనున్నారు. తద్వారా ఎక్కడ బల్బులు వెలగకపోయినా తక్షణమే మరమ్మతులు చేసే వీలు ఉంటుంది. విద్యుత్ సామాగ్రి ఏర్పాటుకు ప్రతియేటా అనంతపురం రూ.కోటి, హిందూపురంలో రూ.50 లక్షలు వెచ్చిస్తున్నారు. ఇక నుండి ఈ సొమ్ము ఖర్చు పెట్టాల్సి ఉండదు. అదే విధంగా వీధి దీపాల వ్యవస్థ, మరమ్మతులు, పర్యవేక్షణకు అనంతపురంలో 34 మంది, హిందూపురంలో 16 మంది పనిచేస్తున్నారు. వీరికి వేతనాల రూపంలో ప్రతినెలా లక్షలాది రూపాయలు చెల్లిస్తున్నారు. వీరిని వీధి దీపాల పర్యవేక్షణ నుండి తప్పించి ఇతర విధులకు వాడుకొనే అవకాశం ఉంటుంది. ఇలా మున్సిపాలిటీలకు విద్యుత్ చార్జీల్లో 50 శాతం, నిర్వహణా సామాగ్రి కొనుగోలుకు వెచ్చించే సొమ్ము, సిబ్బందికి ఇచ్చే వేతనాలు ఆదా కానున్నాయి. ఎల్‌ఇడిలు ఏర్పాటు చేసినందుకు అనంతపురంలో ప్రైవేటు సంస్థకు రూ.16 లక్షలు, హిందూపురంలో రూ.8 లక్షలు ప్రతినెలా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లించినా మున్సిపాలిటీలకు విద్యుత్ బిల్లుల రూపంలో లక్షలాది రూపాయలు ఆదా కానుంది. ఈ లెక్కన ఏడేళ్లలో కోట్లాది రూపాయలు మిగులు లభించడం ఖాయంగా కనిపిస్తోంది. వీటిని ఇతర అభివృద్ధి పనులకు ఖర్చు పెట్టవచ్చు. ఇకపోతే పట్టణంలోని రహమత్‌పురం సర్కిల్, ఎంఎఫ్ సర్కిల్, బాలాజీ సర్కిల్ తదితర కూడళ్లలో హైమాక్స్ లైట్లను కూడా ఎల్‌ఇడిలు ఏర్పాటు చేయగా రహమత్‌పురం సర్కిల్‌లో ఇటీవల ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. కాగా ఈ నెలాఖరు లోగా పట్టణ వ్యాప్తంగా ఎల్‌ఇడిలు వీధి దీపాల అమరికను పూర్తి చేసి కాంతివంతమైన వెలుగులు అందచేయనున్నట్లు చైర్‌పర్సన్ రావిళ్ల లక్ష్మి తెలిపారు. కాగా పుట్టపర్తి నగర పంచాయతీలో కూడా ఎల్‌ఇడిల ఏర్పాటుకు సంబంధిత సంస్థ ఒప్పందం కుదుర్చుకోగా తాడిపత్రిలో మాత్రం పురపాలక సంఘం ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకొంటున్నట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్ ఇంటి కోసం ఎదురుచూపు!
* గృహాల కోసం 40,243 అర్జీలు
నల్లమాడ, జనవరి 22:నిలువ నీడలేని పేదలకు గూడు ఏర్పాటుచేసి ఆదుకోవాలనే సంకల్పంతో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పేరిట ఇళ్ళను మంజూరు చేయడానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని పేదలను గుర్తించి 2లక్షల ఇళ్ళను నిర్మించబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఇదివరకే ప్రకటించడం జరిగింది. దీంతో ఎన్టీఆర్ పేరిట ప్రభుత్వం అందజేయనున్న ఇంటికై ఇళ్ళు లేని పేదలు ఎంతో ఆశతో ఇబ్బడిముబ్బడిగా జన్మభూమి గ్రామసభల్లో అర్జీలు ఇచ్చుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇళ్ళకోసమే 40,243అర్జీలు అందినట్లు సంబంధిత అధికారుల ద్వారా అందిన సమాచారం. ము ఖ్యంగా ఒక ఇంటి నిర్మాణానికి రూ 2.75 లక్షలు మంజూరు కానుండటంతో ప్రభు త్వం ఇచ్చే ఇళ్ళకు మరింత డిమాండ్ పెరిగిందనే చెప్పుకోవచ్చు. అందుకు బ్యాంకులతో ముడిపెట్టడం కాస్త ఇబ్బంది కలిగించే విషయమైనప్పటికీ రూ 1.25 లక్షలు రా యితీ ప్రభుత్వం భరించనుండగా ప్రభు త్వ అనుమతితో బ్యాంకు రుణం రూ 1.50లక్షలు, ఎస్సీ ఎస్టీలకు 1.75లక్షలు రాయితీ ఇస్తూ 1.25లక్షలు ఇంటి నిర్మాణం కోసం రుణం ఇవ్వడం జరుగుతుంది. ప్ర భుత్వం ప్రకటించిన రాయితీ సొమ్ము మి నహా మిగిలిన మొత్తాన్ని ఇళ్ళను నిర్మించుకునే వారు బ్యాంకులకు బ్యాంకరు నిర్దేశించిన విధంగా ప్రతినెలా చెల్లించాల్సి వుం టుంది. కాగా మన జిల్లాకు 16వేల ఇళ్ళు మాత్రమే మంజూరయ్యాయని అధికారులు తెలిపారు. వాటిలో కూడా ఎన్టీ ఆర్ గ్రామీణ ఇంటి పథకం ద్వారా 11,110 ఇళ్ళు, ఐఏవై 15-16 స్కీం ద్వారా 4890 ఇళ్ళు మంజూరయ్యాయి. ఇళ్ళు ఎవరికి మంజూరు చేయాలన్నది మండలస్థాయి అధికారుల నిర్ణయం పై ఆధారపడి ఉంటుంది. అయితే మండల స్థాయి అధికారులు జన్మభూమి కమిటీ సభ్యుల నిర్ణయం మేరకే ఇళ్ళను మంజూరు చేయడం జరుగుతుందని చెప్తున్నారు. దీంతో కొన్ని మండలాల్లో ముందుగా ఇళ్ళ నిర్మాణం కోసం జన్మభూమి కమిటీల్లోని సభ్యులకు, వారివారి బంధువులకు ప్రాధాన్యతను కల్పించడంలో తలమునకలయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొన్ని మండలాల్లో అయితే ప్రభుత్వ ఇల్లు కావాలంటే తమకు రూ.30నుంచి రూ.40వేల వరకు అందజేస్తే ఇంటిని మంజూరు చేయిస్తామని, తెదేపాకు ఓటేసినోడికే ఇంటిని మంజూరు చేస్తామని దందాను కూడా మొదలెట్టినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో చంద్రన్న ప్రభుత్వం అందజేస్తున్న ఇల్లు అందే పరిస్థితులు అంతంతమాత్రమేనని ఇల్లు లేని అర్హులు నిరాశకు గురవుతున్నారు. అధికార పార్టీ నాయకులే వారివారి మండలాల్లో మంజూరైన ఇళ్ళల్లో వారికోసమే పంచుకుంటున్న పరిస్థితి కూడా కొన్ని మండలాల్లో ఇప్పటికే మొదలైందన్నది సమాచారం. ఇల్లు లేని నిజమైన లబ్ధిదారుడైన పేదోడికి ఇంటిని ఇవ్వాలన్న సంకల్పమే ప్రభుత్వానికి వుంటే ఎటువంటి ఇల్లు వున్నా కూడా అటువంటి వారికి ఇంటిని మంజూరు చేయకుండా అందజేయకుండా ఇల్లు లేని అర్హులకే ఇంటిని నిర్మింపజేస్తామని కచ్చితమైన నిబంధనను అమలుపరిస్తే పేదోడికి న్యాయం జరుగే అవకాశాలున్నాయి. కాగా జిల్లాలో ఎన్టీఆర్ ఇళ్ళ నిర్మాణం మంజూరు విషయం పూర్తీ బహిర్గం కావడంతో పాటు ఇళ్ళ నిర్మాణం జరిగితే ఎంతవరకు అర్హులకు ఇళ్ళు అందుతున్నాయన్న విషయం తెలుస్తుంది.