అనంతపురం

ప్రజల స్వచ్ఛంద భాగస్వామ్యంతోనే.. రోడ్డు ప్రమాదాల నివారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జనవరి 22 : ప్రజల స్వచ్ఛంద భాగస్వామ్యంతోనే రోడ్డు ప్రమాదాల నివారణకు అడ్డుకట్ట వేయవచ్చని ఎస్పీ రాజశేఖర్‌బాబు అభిప్రాయపడ్డారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. ప్రాణాలు చాలా విలువైనవని అందుకే మోటారు వాహనాల చట్టాన్ని పాటిస్తూ మెలగాలన్నారు. ఇందుకుగా ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనదారులు సీటు బెల్టు ధరించి డ్రైవింగ్ చేయాలన్నారు. దీంతోపాటు మద్యం తాగి, పొగ తాగుతూ, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదన్నారు. ఇప్పటికే వీటన్నింటిపైనా అటు పోలీసులు, ఇటు రవాణా శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారన్నారు. ఇప్పటికీ రెండు శాఖలూ అవగాహన కల్పిస్తూనే ఉన్నాయన్నారు. ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా రోడ్డు ప్రమాదాల పట్ల, మోటారు వాహనాల చట్టం పట్ల వాహనదారులకు తప్పనిసరిగా అవగాహన ఉండాలన్నారు. అనంతరం నగరంలోని అంబేద్కర్ సర్కిల్‌లో జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోఅదనపు ఎస్పీ కె.మాల్యాద్రి, డిటిసి ప్రసాద్, డిఎస్పీలు మల్లికార్జునవర్మ, నరసింగప్ప, ఎంవి ఐలు వరప్రసాద్, రమేష్, మదుసూధన్, ఎవిఎంఐలు దీపిక, రాణి, విజయకుమార్, రవిశంకర్‌నాయక్, సిఐలు శుభకుమార్, రాఘవన్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.