అనంతపురం

ముమ్మరంగా పరిటాల రవి వర్ధంతి ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామగిరి, జనవరి 22: పరిటాల రవీంద్ర 11వ వర్ధంతి వేడుకల ఏర్పాట్లు వెంకటాపురంలో వేగవంతంగా జరుగుతున్నాయి. ఆదివారం నిర్వహించే వర్ధంతికి అన్ని సౌకర్యాలు చేస్తున్నారు. ప్రధానంగా అన్నదాన కార్యక్రమం సంబంధించి ఎలాంటి ఆటంకం కలగకూడదని భోజనశాలను ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. భోజనశాలలో బారికేడ్లు, కౌంటర్లపై మంత్రి చర్చించారు. వస్తున్న వస్తు సామాగ్రిని పరిశీలిస్తు ఎంతమంది అభిమానులు వచ్చినా ఇబ్బంది కలుగకుండా వుండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పరిటాల ఘాట్ వద్ద ప్రత్యేకంగా అలంకరణ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఘాట్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. వర్ధంతి రోజు తాగునీటి సౌకర్యం, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా వుండాలని ఆర్‌డబ్ల్యూఎస్, ట్రాన్స్‌కో అధికారులతో మంత్రి చర్చించారు.
అదేవిధంగా అభిమానులు వేల సంఖ్యలో తరలి రానుండడంతో ట్రాఫిక్ నియంత్రణ ఎలాంటి సంఘటనలు జరగకుండా వుండేలా పోలీసు బందోబస్తుపై మంత్రి సమీక్షించారు. డిఎస్‌పి వేణుగోపాల్, సిఐ రాజా, ఎస్‌ఐలు శేఖర్, రామారావులతో ప్రత్యేకంగా చర్చించి బందోబస్తుపై మాట్లాడారు. సాయంత్రం జెడ్‌పి చైర్మన్ చమన్‌సాబ్ కూడా వెంకటాపురం గ్రామానికి వచ్చి ఏర్పాట్లను పర్యవేక్షించారు. మంత్రి సునీతతో సమావేశమై ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు.

మదిగుబ్బ చెరువులో చేపలు
వదిలిన మంత్రి పరిటాల సునీత
ఆత్మకూరు, జనవరి 22: మండల పరిధిలోని మదిగుబ్బ, రంగంపేట గ్రామాల చెరువుల్లో మంత్రి పరిటాల సునీత శుక్రవారం చేపపిల్లల పెంపకానికి శ్రీకారం చుట్టారు.. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం ద్వారా కట్ల, రూఫ్, మృగాల రకాలకు చెందిన చేపపిల్లలను మదిగుబ్బ చెరువులోకి 71444, రంగంపేట చెరువులోకి 16850 చేప పిల్లలను వదిలారు. మదిగుబ్బ చెరువులోకి అవసరమైనంత మేరకు నీరు తెప్పించినందుకు గ్రామస్థులు మంత్రికి సత్కారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే చెరువుల్లో నీరు ఉండాలని ఇప్పుడు చెరువుకు నీరు సమృద్ధిగా వచ్చినందున చేపపిల్లల పెంపకానికి అనుకూల వాతావరణం ఏర్పడిందన్నారు. చెరువులో పంటసాగుకు నీరు పుష్కలంగా ఉందిగాన వరినాట్లు వేసుకోవాలని రైతులకు సూచించారు. వరినాట్లు వేసేరోజు తానుకూడా మదిగుబ్బ విచ్చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితోబాటు మత్స్యశాఖ సంచాలకులు నాగేశ్వరరావు, మత్స్యశాఖ జిల్లా సంఘం అధ్యక్షులు అక్కులప్ప, అనిల్‌చౌదరి, ఎంపిపి మారెక్క, సర్పంచ్ భాస్కరనాయక్ స్థానిక అధికారులు పాల్గొన్నారు.