అనంతపురం

నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జనవరి 22 : జిల్లాలోని ఉద్యానవన శాఖ, ఎపిఎంఐపిలకు నిర్దేశించిన మేరకు లక్ష్యాలు సాధించాలని లేకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ కోన శశిధర్ హెచ్చరించారు. శుక్రవారం ఆయా శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ 15,69 0 హెక్టార్లలోడ్రిప్ ఇరిగేషన్‌ను ప్రోత్సహించాలన్న లక్ష్యానికి 15,125 హెక్టార్లలోనే సాధించారన్నారు. ఇప్పటికే మంజూరు చేసిన 15,125 హెక్టార్లలో ఫిబ్రవరి 15లోపు మెటీరియల్ సరఫరా చేసి బిగించాలని డ్రిప్ ఇరిగేషన్ కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు. ఈనెల 30వతేదీ లోపుడ్రిప్ ఇరిగేషన్ పరికరాలపై రైతులు డిడిలు తీసి చెల్లించాలన్నారు. మైక్రో ఏరియా అధికారులు దీనిపై దృష్టి సారించి రైతులతో మాట్లాడి డిడిలు తీసేలా కృషి చేయాలన్నారు. ఈఏడాది లక్ష్యాన్ని మార్చి 15 నాటికే సాధించేలా అధికారులు, డ్రిప్ ఇరిగేషన్ కంపెనీలు, రైతులు కృషి చేయాలన్నారు. ఇప్పటికే జిల్లా హార్టికల్చర్ హబ్‌గా ప్రసిద్ధి చెందిందని, అంతేగాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబుకు జిల్లాపై ప్రత్యేక అభిమానంతో హార్టికల్చర్‌ను మరింత అభివృద్ధి చేయాలని అనేక రాయితీలను అందిస్తున్నారన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు పూర్తిచేసి హార్టికల్చర్ లోడబుల్ డిజిట్ గ్రోత్‌ను సాధించాలన్నారు. జిల్లాలోని ఆయా శాఖలకు సంబంధించి నిధులు తెప్పించే బాధ్యతను తీసుకుంటానని, కష్టపడి పనిచేసి మంచి ఫలితాలను సాధించాలని సూచించారు. రైతులకు లాభాలు వచ్చే విధంగా తగు సలహాలు, సూచనలు ఇచ్చి ఆధునిక పద్ధతుల్లో పంటలు సాగు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా శాఖలు తప్పుడు నివేదికలతో వస్తే మాత్రం ఏ మాత్రం సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఇకపై ప్రతివారం సమావేశాలు నిర్వహించి ఆ వారంలో సాధించిన ఫలితాలను సమీక్షిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎపిఎంఐపి పిడి వెంకటేశ్వర్లు, హార్టికల్చర్ డిడి సుబ్బరాయుడు, ఎడిలు సత్యనారాయణ, రమణ, మైక్రో ఇరిగేషన్ కంపెనీ ప్రతినిధులు, హార్టికల్చర్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.