జాతీయ వార్తలు

మెహబూబాతో రాంమాధవ్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఏప్రిల్ 30: కాశ్మీర్ లోయలో ఉద్రిక్తతలు, అధికార కూటమి భాగస్వాములయిన పిడిపి, బిజెపిల మధ్య విభేదాల నేపథ్యంలో బిజెపి జాతీయ కార్యదర్శి, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి రామ్ మాధవ్ ఆదివారం ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో ఆమె నివాసంలో భేటీ అయ్యారు. దాదాపు అరగంట సేపు సమావేశమైన తర్వాత బైటికి వచ్చిన రామ్‌మాధవ్ బయట వేచి ఉన్న మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు.
కాశ్మీర్ లోయలో రోజురోజుకు శాంతిభద్రతల పరిస్థితులు దిగజారి పోతుండడం, అలాగే రామ్‌మాధవ్, రాష్ట్ర మంత్రి చంద్రప్రకాశ్ గంగా చేసిన ప్రకటనలపై బిజెపి, పిడిపిల మధ్య విభేదాలు తలెత్తాయంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో రామ్‌మాధవ్ పిడిపి చీఫ్ కూడా అయిన మెహబూబాతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. శాసన మండలి ఎన్నికల్లో బిజెపి చేతిలో పిడిపి ఓడిపోవడం కూడా రెండు పార్టీల మధ్య విభేదాలకు కారణమైంది.