క్రీడాభూమి

ఆస్ట్రేలియాతో పోరుకు భారత జట్టు రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇపో, మే 1: ప్రతిష్ఠాత్మకమైన అజ్లాన్ షా హాకీ టోర్నమెంట్‌లో మంగళవారం డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను ఎదుర్కోవడానికి భారత్ సిద్ధమైంది. ఈ టోర్నీలో భాగంగా మొదటి మ్యాచ్‌లో గ్రేట్ బ్రిటన్‌ను ఢీకొన్న భారత్ దానిని డ్రా చేసుకుంది. ఇరు జట్లు చెరి రెండు గోల్స్ చేశాయి. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను భారత్ 3-0 తేడాతో చిత్తుచేసింది. హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్‌తో రాణించి, ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకు ముందు ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ని 1-1గా డ్రా చేసుకున్న న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించడంతో భారత జట్టులో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. అయితే, ఆసీస్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదన్నది వాస్తవం. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ని డ్రా చేసుకున్న ఆ జట్టు రెండో మ్యాచ్‌లో మలేసియాను 6-1 తేడాతో చిత్తుచిత్తుగా ఓడించింది. మరోసారి అదే స్థాయిలో విరుచుకుపడితే, భారత్‌కు కష్టాలు తప్పవు. అయితే, యువకులు, సీనియర్లతో సమతూకంగా ఉన్న భారత్ గట్టిపోటీనిస్తుందని, విజయం కోసం చివరి క్షణం వరకూ పోరాడుతుందని జట్టు చీఫ్ కోచ్ రొలాంట్ ఆల్ట్‌మన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అన్ని విభాగాల్లోనూ జట్టు పుంజుకుందని చెప్పాడు. పొరపాట్లను పునరావృతం చేయకపోవడం, పెనాల్టీలను గోల్స్‌గా మలచడం వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించామని, తమ వ్యూహం ఫలిస్తుందన్న నమ్మకం తనకు ఉందని చెప్పాడు.