జాతీయ వార్తలు

తృణమూల్ కార్యాలయంలో పేలుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐదుగురు మృతి

పలువురికి గాయాలు
పేలుడు కారణంపై దర్యాప్తు

కోల్‌కతా, మే 7: పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయంలో పేలుడు పదార్థాలు విస్ఫోటనం చెందిన ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. బర్ద్వాన్ జిల్లాలోని పార్టీ కార్యాలయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మొదట్లో పలువురు గాయపడినట్లుగా కథనాలు వెలువడినప్పటికీ ఒక్కసారిగా ఐదుగురు మృతిచెందినట్లుగా వార్తలు వచ్చాయి.
ఆదివారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన అసూగ్రామ్ కార్యాలయంలో ఈ విస్ఫోటనం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ భవనంలో పేలుడు పదార్థాలను నిల్వ ఉంచడం వల్ల ఈ విస్ఫోటనం జరిగినట్లుగా పోలీసు సూపరింటెండెంట్ అగర్వాల్ వెల్లడించారు. అసలు ఈ కార్యాలయంలోకి పేలుడు పదార్థాలు ఎలా వచ్చాయి? వాటిని ఎవరు తీసుకొచ్చారు? అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించామని పేర్కొన్న ఎస్‌పి మృతులెవరన్నది కూడా నిర్ధారిస్తున్నామని తెలిపారు.