క్రీడాభూమి

పుణే, గుజరాత్ జట్లకు ఎక్స్‌టెన్షన్ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 7: ఈ ఏడాదితోనే రైజింగ్ పుణే సూపర్‌జెయింట్, గుజరాత్ లయన్స్ కాంట్రాక్టు పూర్తవుతుందని, దానిని పొడిగించే ప్రసక్తే లేదని ఐపిఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా స్పష్టం చేశాడు. బిసిసిఐ ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న అతను ఆతర్వాత విలేఖరులతో మాట్లాడుతూ స్పాట్ ఫిక్సింగ్ కేసులో రెండేళ్ల సస్పెన్షన్‌కు గురైన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలు శిక్షా కాలాన్ని పూర్తి చేసుకొని, వచ్చే ఏడాది ఐపిఎల్‌లో పాల్గొంటాయని చెప్పాడు. పది జట్లతో ఐపిఎల్‌ను నిర్వహించాలని ఒకవేళ నిర్ణయించినా, పుణే, గుజరాత్ జట్లకు ఎక్స్‌టెన్షన్ ఉండదని, రెండు ఫ్రాంచైజీల ఎంపిక కోసం ఆ ఫ్రాంచైజీలు కూడా బిడ్డింగ్‌లో పాల్గొనక తప్పదని తేల్చిచెప్పాడు. ఐపిఎల్‌ను పది జట్లకు పెంచే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు శుక్లా నేరుగా సమాధానం చెప్పలేదు. ఒకవేళ పది జట్లు బరిలోకి దిగితే, మొత్తం 84 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది కాబట్టి, ఎనిమిది జట్లకే ఐపిఎల్ కమిటీ మొగ్గు చూపుతున్నదని సమాచారం. అయితే, దీనిపై శుక్లా వివరణ ఇవ్వలేదు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం వచ్చే ఏడాది చెన్నై, రాజస్థాన్ జట్లు మళ్లీ ఐపిఎల్‌లోకి అడుగుపెడతాయని అన్నాడు.
పాక్ పర్యటన ప్రసక్తిలేదు
భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్‌లో పర్యటించే ప్రసక్తే లేదని బిసిసిఐ సీనియర్ అధికారిగా కొనసాగుతున్న రాజీవ్ శుక్లా అన్నాడు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడాలంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) లీగల్ నోటీసు జారీ చేసిందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. అయితే, పాక్‌లో భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని, అక్కడ టీమిండియా పర్యటించడం ఏమాత్రం క్షేమం కాదని అన్నాడు. శాంతి భద్రతల పరిస్థితి పాక్‌లో చక్కదిబడిన తర్వాతే ఆ దేశంలో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు భారత్ సిద్ధమవుతుందని స్పష్టం చేశాడు. పాక్ పర్యటనకు పంపడం ద్వారా టీమిండి యా క్రికెటర్లను ప్రమాదంలోకి నెట్టలేమ ని వ్యాఖ్యానించాడు. ఇప్పట్లో పాక్ పర్య టన ఉండదన్నాడు.