హైదరాబాద్

ఆరని అసంతృప్తి జ్వాలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22:జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని మూడురోజులుగా ప్రధాన రాజకీయపార్టీలకు అసంతృప్తి జ్వాలల సెగ తగులుతోంది. కాంగ్రెస్ పార్టీ ఈ మంటల సెగ తగలటంతో ఆందోళనకు దిగిన కార్యకర్తలకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో గాంధీభవన్‌కు నేతలు తాళాలు వేసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి నిరసన జ్వాలలు బిజెపి, టిడిపి పార్టీలను కూడా వెంటాడుతోంది. రంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షుడు ఏకంగా తన పదవీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే! అంతేగాక, శుక్రవారం రాజీనామాలు చేసిన బిజెపి నేతలు రహస్యంగా సమావేశమై టికెట్ల కేటాయింపు వ్యవహారంపై బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. నామినేషన్ల సమయంలో టికెట్ ఆశించిన దరఖాస్తులు దాఖలు చేసిన తిరుగుబాటుదారులతో ఆయా పార్టీలు నయానో భయానో రాజీ కుదిర్చి, వారిచే నామినేషన్లు ఉపసంహరింపజేసినా, రేపు ఎన్నికల ప్రచారంలో వారి కలిసోస్తారన్న నమ్మకం పార్టీలకు లేదు. వారి వ్యవహారం అభ్యర్థుల జయాపజయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని టిడిపి, బిజెపి, కాంగ్రెస్ నేతల్లో ఆందోళన నెలకొంది. నామినేషన్ల పర్వం ముగిసినా, కాంగ్రెస్ కార్యకర్తలు నేతల నిరసనలు గాంధీభవన్ ముందు ఆగకపోవటంతో నేతలు తాళం వేసి, ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. దీంతో టికెట్లు ఆశించిన భంగపడిన వారే గాక, నేతలను కలిసేందుకు వచ్చిన ఇతర కార్యకర్తలు సైతం ఇబ్బందుల పాలయ్యారు.