హైదరాబాద్

వాహనాల తనిఖీలో రూ.9 లక్షలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైదాబాద్, జనవరి 22: సరైన ధ్రువపత్రాలు లేకుండా కారులో తరలిస్తున్న నగదును సంతోష్‌నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంతోష్‌నగర్ ఏసిపి వి.శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... ఎన్నికల బందోబస్తులో భాగంగా సంతోష్‌నగర్ పోలీసులు స్థానిక శ్రీనివాస ఆసుపత్రి సమీపంలో శుక్రవారం రాత్రి వాహనాల తనిఖీలు నిర్వహించారు. అటుగా వచ్చిన కారు (టి ఆర్ నెంబర్-3160)లో సరూర్‌నగర్‌కు చెందిన వెంకటేశ్వర్‌రావు, ఆర్‌కెపురానికి చెందిన రాజేష్ అనే వ్యక్తుల వద్ద తనిఖీ చేయగా 9లక్షల రూపాయలు బయటపడ్డాయి. నగదుకు సంబంధించి సరైన ధ్రువపత్రాలు వారు చూపించకపోవడంతో పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం చట్టరీత్యా తగిన చర్యలు తీసుకుంటామని ఏసిపి తెలిపారు.
హైదర్‌నగర్‌లో ప్లెక్సీ వివాదం
కెపిహెచ్‌బికాలనీ, జనవరి 22: ఫోటోలేని కారణంగా ఇరువర్గాల మధ్య మంత్రి సమక్షంలోనే తోపులాటలు జరిగాయి. హైదర్‌నగర్ అడ్డగుట్టలో టిఆర్‌ఎస్ అభ్యర్ధి రుద్రరాజు జానకిరామరాజు కార్యాలయం ప్రారంభించేందుకు మంత్రి పట్నం మహేందర్‌రెడ్డిని ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. కాగా ప్రారంభోత్సవం సందర్బంగా ఏర్పాటుచేసిన ప్లెక్సీలలో మంత్రి మహేందర్‌రెడ్డితో పాటు శేరిలింగంపల్లి ఇన్‌చార్జి శంకర్‌గౌడ్ ఫోటో లేకపోవడంతో ప్రోటోకాల్ పాటించలేదని శంకర్‌గౌడ్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దశలో మంత్రి సమక్షంలోనే మొవ్వా సత్యనారాయణ, శంకర్‌గౌడ్ వర్గీయుల మధ్య తోపులాటలు జరిగి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు, మంత్రి జోక్యంతో ఇరువర్గాలకు నచ్చచెప్పి వివాదం సద్దుమనిగేలా చేశారు