హైదరాబాద్

టిడిపికి వికె గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మల్కాజిగిరి, జనవరి 22: మల్కాజిగిరి తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి వికె.మహేష్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. మహేష్ టిఆర్‌ఎస్‌లో చేరేందుకు అంతా సిద్ధమైంది. పార్టీలో తనకు సరైన గౌరవం దక్కటం లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన రెండురోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. కార్పొరేటర్ టికెట్ విషయంలో తన మాటకు విలువ ఇవ్వకపోవటంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. విషయం తెలుసుకున్న టిఆర్‌ఎస్ గ్రేటర్ అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు శుక్రవారం వికె.మహేష్ ఇంటికి వచ్చి చర్చించారు. పార్టీలో చేరేందుకు మహేష్ సుముఖతను వ్యక్తం చేశారు.
కాంగ్రెస్‌లోనూ ఆగ్రహజ్వాలలు
మల్కాజిగిరిలో సీనియర్‌లకు పార్టీ అధిష్టానం తీవ్ర అన్యాయం చేసిందని కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు. మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని వివిధ డివిజన్లలలో టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు బి.సురేష్ యాదవ్, ఎన్‌ఎండిసి కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మోహన్‌రావు, అతని అనుచరులు, జి.రామకృష్ణ, రాజుయాదవ్, వెంకటేష యాదవ్ వెళ్లి గాంధీభవన్ ముందు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.మల్కాజిగిరిలో ఒక్క డివిజన్‌ను గెలిపించే సత్తాలేని సర్వే పార్టీని పూర్తిగా భ్రష్టు పట్టించారని వారు ధ్వజమెత్తారు.