క్రీడాభూమి

పాండ్య సోదరులకు సెవాగ్ చురకలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 15: ఐపిఎల్‌లో ముంబయి ఇండియన్స్ తరఫున ఆడుతున్న పాండ్య సోదరులు హార్దిక్, కృణాల్ ఒకరిపై ఒకరు ట్విటర్లో చేసుకున్న వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్ వీరేందర్ సెవాగ్ స్పందించాడు. ఇద్దరికీ చురకలు వేశాడు. ఈడెన్ గార్డెన్స్ మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఐపిఎల్ గ్రూప్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ తొమ్మిది పరుగుల తేడాతో గెలిచింది. ఆమ్యాచ్ సుమయంలో ఏం జరిగిందో తెలియదుగానీ, కృణాల్‌ను ఉద్దేసిస్తూ, ‘ఒక్కోసారి జీవితంలో మనకు దగ్గరగా ఉన్నవారే ఎక్కువగా నిరాశపరుస్తుంటారు. ఇది ప్రశాంతనివ్వదు సోదరా’ అని హార్దిక్ ట్వీట్ చేశాడు. దానికి కృణాల్ బదులిస్తూ, ‘అసలు ఆ సంఘటన జరగకుండా ఉంటేనే బాగుండేది. నేను నీ కంటే పెద్దవాడిని. దీనిని పెద్ద సమస్యగా మార్చకు’ అని ట్వీట్ చేశాడు. ఇలా అన్నదమ్ములు సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టుకోవడం సెవాగ్‌కు ఏమాత్రం నచ్చలేదు. చాలా అంశాలపై తనదైన శైలిలో స్పందించే అతను పాండ్య సోదరుల వివాదంపైనా మాటలు తూటాలు పేల్చాడు. ‘బాప్ బడా న భయ్యా.. సబ్‌సే బడా రుపయ్యా’ (తండ్రి పెద్దకాదు.. అన్నా పెద్దకాదు.. అన్నిటికంటే పెద్దది రూపాయి) అంటూ మొదలయ్యే సినిమా పాటను ప్రస్తావించాడు. ఈ పాటను సీరియస్‌గా తీసుకోవద్దని వ్యాఖ్యానించాడు. ఘర్షణ వద్దని హితవు చెప్పాడు.
కాగా, ఇంట్లో కూర్చొని పరిష్కరించుకోవాల్సిన చిన్నచిన్న విషయాలను సోషల్ మీడియాలో చర్చగా మార్చడం ఏమిటంటూ పాండ్య సోదరులపై అభిమానులు మండిపడుతున్నారు.

కృణాల్, హార్దిక్ పాండ్య (ఫైల్ ఫొటో)