జాతీయ వార్తలు

మూల్యం తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16:కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, ఆయన కుమారుడు కార్తి, ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్ ఇళ్లు కార్యాలయాలపై జరిగిన సోదాలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గట్టిగా సమర్థించుకున్నారు. చాలా మంది తమ పాపాలకు మూల్యం చెల్లించుకోవాల్సిన రోజు వచ్చిందని, తమ తప్పులకు వారు జవాబుదారీ కావాల్సిందేనని జైట్లీ ఉద్ఘాటించారు. బలమైన ఆధారం లేదా అనుమానం ఉంటే తప్ప సిబిఐ లేదా ఆదాయం పన్ను విభాగం అధికారులు దాడులు, సోదాలు జరిపే అవకాశమే ఉండదని చెప్పారు. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు డొల్ల కంపెనీల ద్వారా ఆస్తులు సంపాదించుకోవడం అన్నది చిన్న విషయం కాదని, అలాంటి అనేక మందికి రోజులు దగ్గర పడ్డాయని జైట్లీ పేర్కొన్నారు. ఇలాంటి వారిని వదిలి పెట్టేది లేదని మంగళవారం నాడిక్కడ విలేఖరుల సమావేశంలో జైట్లీ అన్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ దాడులు జరిగాయన్న ఆరోపణలను ఆయన తిరస్కరించారు. బలమైన ఆధారాలు ఉండటమే ఈ దాడులకు కారణమని ఉద్ఘాటించారు.