జాతీయ వార్తలు

ఇసి అధికారులకు స్థారుూసంఘం సమన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 17: ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్ల (ఇవిఎంల) వివాదంపై తన ముందు హాజరు కావలసిందిగా పార్లమెంటరీ స్థారుూ సంఘం ఎన్నికల సంఘం (ఇసి) అధికారులకు సమన్లు జారీ చేసింది. ఇవిఎంల విశ్వసనీయతను ప్రశ్నిస్తూ, తిరిగి పేపర్ బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని అనేక పార్టీలు డిమాండ్ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ శర్మ నేతృత్వంలో సిబ్బంది, ప్రజా సమస్యలు, న్యాయ వ్యవహారాలపై ఏర్పడిన పార్లమెంటరీ స్థారుూ సంఘం ఈ సమన్లు జారీ చేసింది. ఈ పార్లమెంటరీ స్థారుూ సంఘం ఎన్నికల సంస్కరణలపై ఈ నెల 19న సమావేశం కానుంది. ఒక డిప్యూటి ఎలక్షన్ కమిషనర్, లెజిస్లేటివ్ డిపార్ట్‌మెంట్, న్యాయ మంత్రిత్వ శాఖలకు చెందిన ఒక ప్రిన్సిపల్ సెక్రటరి, సెక్రటరి సహా ఇసికి చెందిన సీనియర్ అధికారులకు సమన్లు జారీ అయ్యాయి. తన ముందు హాజరయి ఇవిఎంలు, వాటి విశ్వసనీయత గురించి సభ్యులకు వివరించాలని వీరిని పార్లమెంటరీ స్థారుూ సంఘం ఆదేశించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
29నుంచి మోదీ విదేశీ పర్యటన
న్యూఢిల్లీ, మే 17: ప్రధాని నరేంద్ర మోదీ భారత్‌లో పెట్టుబడులను ఆహ్వానించాలన్న ఉద్దేశంతో ఈనెల 29 నుంచి జర్మనీ, స్పెయిన్,రష్యాల్లో పర్యటించననున్నారు. ఆ దేశాలతో సంబంధాలు పటిష్టం చేసుకోవడంతోపాటు పెట్టుబడులను తీసుకురావాలన్నదే ఆయన విదేశీ పర్యటన ప్రధాన ఉద్దేశం. జర్మనీ, స్పెయిన్‌లతో ద్వైపాక్షిక సంబంధాల మెరుగుపరచుకోవడం అలాగే రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ జూన్‌లో జరగనున్న ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం (ఎస్‌పిఐఇఎఫ్) సమ్మిట్ దృష్ట్యా మోదీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. జూన్ 1 నుంచి మూడు రోజుల పాటు ఎస్‌పిఐఇఎఫ్ జరుగనుంది. దీనికి వేలాది మంది దిగ్గజ కంపెనీల అధిపతులు హాజరవుతున్నందున ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రధాని యోచిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోదీ సమావేశమవుతారు.
మోదీ లంక పర్యటన విజయవంతం
బీజింగ్: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి శ్రీలంక పర్యటన విజయవంతమైందని ఆ దేశ మంత్రి శరత్ అమనుగమ వెల్లడించారు. చైనాలో జరిగిన ‘వన్ బెల్ట్-వన్ రోడ్’ సదస్సుకు ఆయన శ్రీలంక ప్రధానితోపాటు హాజరయ్యారు. మోదీ పర్యటనలో అనేక ప్రాజెక్టుల పూర్తికి ఒప్పందాలు జరిగాయని, వాటిలో ట్రింకోమలి పోర్టు ప్రాజెక్టు అతిముఖ్యమైనదని అన్నారు.
‘మా దేశాధ్యక్షుడు, ప్రధాని - నరేంద్ర మోదీతో మంచి సంబంధం కలిగివున్నారని, మోదీ పర్యటనతో చాలా ప్రాజెక్టుల పూర్తికి ఊతం లభించినట్లయిందని’ అమనుగమ పేర్కొన్నారు. ట్రింకోమలి పోర్టులో రెండు దేశాల ఆయిల్ ట్యాంకులను సంయుక్తంగా నిర్వహించేందుకు ఒప్పందం కుదిరిందని తెలిపారు. చైనాతో సంబంధాలపై ప్రస్తావిస్తూ, ‘్భరతీయులు నైసర్గికంగా మాకు సోదరులు, అలాగే చైనా మాకు ఎప్పటినుంచో మిత్ర దేశం. రెండు దేశాల పట్ల మాకు అపారమైన గౌరవం ఉన్నాయి. ఒకరికి మద్దతు ఇవ్వడం, మరొకరికి ఇవ్వకపోవడం వంటి చర్యలకు పాల్పడం’ అని ఆయన స్పష్టం చేశారు.