క్రీడాభూమి

దుబాయ్‌లో పిసిబి, బిసిసిఐ అధికారుల కీలక సమావేశం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, మే 24: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ), పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అధికారులు ఈనెలాఖరులో దుబాయ్‌లో సమావేశమయ్యే అవకాశం ఉంది. పిసిబి చైర్మన్ షహర్యార్ ఖాన్, పాలక మండలి అధ్యక్షుడు నజాం సేథీ, చీఫ్ ఆపరేటింగ్ అధికారి సుభాన్ అహ్మద్ దుబాయ్‌లో జరిగే సమావేశానికి హారవుతారని స్థానిక మీడియా కథనం. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడడానికి నిరాకరిస్తున్న బిసిసిఐ 69.4 మిలియన్ డాలర్ల పరిహారాన్ని ఇప్పించాలని పిసిబి డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయంలో ఇప్పటికే బిసిసిఐకి లీగల్ నోటీసు కూడా పంపింది. అయితే, ఘర్షణ పడితే లాభం లేదన్న ఉద్దేశంతో, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని చూస్తున్నదని సమాచారం. బిసిసిఐ అధికారులు వచ్చేనెల దుబాయ్‌లో ఐసిసి సమావేశానికి హాజరుకానున్నారని, అదే సమయంలో వారితో చర్చలు జరిపే అవకాశం ఉందని తెలుస్తున్నది.
మహిళా బాక్సర్లకు విదేశీ కోచ్
న్యూఢిల్లీ, మే 24: భారత మహిళా బాక్సర్లకు తొలిసారి విదేశీ కోచ్ రాబోతున్నాడు. రెండేళ్ల కాంట్రాక్టుపై ఫ్రాన్స్‌కు చెందిన స్ట్ఫోన్ కొటాలొర్డా కోచ్‌గా వ్యవహరిస్తాడని, వచ్చేనెల మొదటి వారంలో అతను బాధ్యతలు స్వీకరిస్తాడని భారత బాక్సింగ్ సమాఖ్య (బిఎఫ్‌ఐ) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. యూరోపియన్ బాక్సింగ్ సమాఖ్య కోచ్‌ల కమిషన్ సభ్యుడిగా వ్యవహరిస్తున్న 41 ఏళ్ల కొటాలొర్డా 2019 వరకూ భారత చీఫ్ కోచ్‌గా ఉంటాడు. కాగా, పురుషుల విభాగంలో చీఫ్ కోచ్‌గా ఇటీవలే ఎంపికైన రాఫెల్ బెర్గామస్కో 2020 డిసెంబర్ వరకూ ఆ హోదాలో కొనసాగుతాడు. ఇలావుంటే, మహిళా బాక్సర్లకు ఒక విదేశీ కోచ్‌ను నియమించడం ఇదే మొదటిసారి. చాలా కాలంగా విదేశీ కోచ్ నియామకంపై డిమాండ్ వినిపిస్తున్నప్పటికీ, బిఎఫ్‌ఐ ఇన్నాళ్లకు సానుకూలంగా స్పందించింది.