జాతీయ వార్తలు
పుట్టిన వెంటనే నడిచిన శిశువు!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 29 May 2017
న్యూఢిల్లీ, మే 28: అప్పుడే పుట్టిన శిశువులు కష్టంమీద తమ కళ్లను తెరవగలరు. మనం ఇప్పటివరకు నేర్చుకున్నది, చెప్పింది, చూసింది ఇదే. కాని, తల్లి గర్భంనుంచి అప్పుడే బయటకు వచ్చిన ఒక శిశువు పడిపోకుండా తన కాళ్ల మీద తాను నిలబడటమే కాకుండా, నడిచిన దృశ్యంతో కూడిన ఒక వీడియో సామాజిక మాధ్యమాలలో హల్చల్ చేస్తోంది. నమ్మశక్యం కాని ఈ వీడియో ప్రపంచ వ్యాప్తంగా అనేకమందిని ఆకర్షిస్తోంది. పోస్ట్ చేసిన కొద్దిసేపట్లోనే వైరల్ అయింది. తల్లి గర్భంనుంచి నర్సు చేతిలో పడిన ఈ బిడ్డ తన కాళ్ల మీద తాను నిలబడి నడిచిన ఈ దృశ్యం అసామాన్యం. మామూలు చిన్నారులకు భిన్నంగా పుట్టిన వెంటనే నడిచిన ఈ శిశువు వీడియోను ఎవరైనా వీక్షించాల్సిందే.