జాతీయ వార్తలు

నిషేధాన్ని ఒప్పుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ కోల్‌కతా/ చెన్నై, మే 29: వధించటం కోసం పశుగణాల విక్రయాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా విధించిన ఆంక్షలపై దేశవ్యాప్తంగా రాజకీయ వివాదం రాజుకుంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తాము ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించేది లేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సోమవారం నాడు తేల్చి చెప్పారు. కేంద్రం విధించిన ఈ నిషేధం అప్రజాస్వామికమని, రాజ్యాంగ విరుద్ధమంటూ ఆమె మండిపడ్డారు. దీని న్యాయబద్ధతను సవాలు చేస్తామని కూడా ప్రకటించారు. దేశ సమాఖ్య స్వరూపాన్ని దెబ్బ తీయటమే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోందని సోమవారం కోల్‌కతాలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. అంతే కాకుండా రాష్ట్రాల హక్కులను కాలరాసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనైతిక చర్యగా అభివర్ణించారు. కాగా తమిళనాడులోని మదురై, కోయంబత్తూర్, ఈరోడ్, హోసూర్ సహా అనేక ప్రాంతాల్లో కేంద్ర నిర్ణయంపై నిరసనలు చెలరేగాయి. పశుమాంసం తినే పోటీ నిర్వహించినందుకు ఓ తమిళ అనుకూల సంస్థకు చెందిన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం రాత్రే ఐ ఐటి మద్రాసుకు చెందిన కొందరు విద్యార్థులు తమ క్యాంపస్ ప్రాంగణంలోనే మాంసం ఉత్సవాన్ని నిర్వహించారు. కేంద్ర నిషేధానికి వ్యతిరేకంగా వెంటనే ఓ చట్టాన్ని తీసుకురావాలని అధికార అన్నాడి ఎంకె పార్టీని రాష్ట్రంలోని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ నెల 31న స్టాలిన్ సారథ్యంలో ఆందోళన చేపడతామని డిఎంకె ప్రకటించింది. కేరళలో ఓ లేగదూడను వధించిన సంఘటనపై యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రిజిల్ మకుటి సహా ముగ్గురిని సస్పెండ్ చేసింది.