ఉత్తరాయణం

ఎగవేతదారుల వివరాలు చెప్పరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకుని ‘ఎగవేతదారులు’గా మారిన బడాబాబుల వివరాలను వెల్లడించరాదని రిజర్వు బ్యాంకు ఏమైనా ఆదేశాలిచ్చిందా? ప్రభుత్వ,ప్రైవేటు బ్యాంకులు ఈ విషయమై ఎందుకు వౌనం వహిస్తున్నాయి? రుణాలు వసూలు కాకపోతే బ్యాంకులు, ఎగవేతదారులు కుమ్మక్కయ్యారన్న అనుమానాలు కలగడం సహజం. అక్రమాలకు పాల్పడినవారు ప్రముఖ రాజకీయ నేతలైనప్పటికీ వారి బాగోతం ప్రజలకు తెలియాలి. రుణగ్రస్తుల వివరాలు వెల్లడించరాదని ఇంతవరకూ ఏ న్యాయస్థానం ఆదేశించలేదు. దేశ ప్రజలు ఎంతో నమ్మకంగా బ్యాంకుల్లో డబ్బు దాచుకోగా, బడాబాబులకు, రాజకీయ ప్రముఖులకు బ్యాంకులు ఉదారంగా రుణాలిస్తున్నాయి. రుణాలు తీసుకున్నవారు ఎగవేతదారులుగా మారితే ప్రజల సొమ్ముకు భద్రత ఎక్కడ? ఈ ఎగవేతదారుల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. వాణిజ్యవేత్తలైనా, రాజకీయ నేతలైనా ప్రజలను దాటిపోలేరు. అవినీతిని తగ్గించాలంటే ప్రతి విషయంలోనూ పారదర్శకత ఉండాలి. బ్యాంకు రుణాలను ఎగవేసిన వారి పేర్లను, వారు తీసుకున్న మొత్తాలను తెలియజేసే సమాచారాన్ని వెబ్‌సైట్లలో ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
- టి.హనుమాన్ చౌదరి, సికిందరాబాద్
బీసీలకూ ఉచిత విద్యుత్
ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో నివసించే వారికి జగజ్జీవన్ జ్యోతి పేరుతో ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్యుత్‌ను ఇప్పటివరకు నెలకు ఏభై యూనిట్లు అందిస్తుండగా, వచ్చే జూన్ నుండి 75 యూనిట్లకు పెంచడం హర్షణీయం. అయితే, బీసీ వర్గాలకు చెందిన చేనేత, కల్లుగీత, కమ్మరి, కుమ్మరి, రజక వృత్తిదారులెందరో విద్యుత్ బిల్లులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. వెనుకబడిన వర్గాల్లో కుటుంబ పోషణకు విలవిల్లాడుతున్న అభాగ్యులకు విద్యుత్ వినియోగం డెబ్బైఅయిదు యూనిట్లు వాడకం మించని వారికి ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
- యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం
తెలుగు వెలిగేది ఎలా?
జూనియర్, డిగ్రీ కళాశాలల్లో తెలుగు భాష కనుమరుగై పోతోంది. వంద మందిలో రెండు శాతం మాత్రమే తెలుగు చదివేవారున్నారు. అతి కొద్దిమంది కోసం ఒక అధ్యాపకుడిని నియమించేందుకు ప్రైవేటు కళాశాలలు సిద్ధంగా లేవు. కళాశాల స్థాయిలో ఇప్పుడు ఎవరికైనా సరే తెలుగు వద్దనిపిస్తుంది. విద్యార్థులు సైతం గైడ్లు కొనుక్కొని పరీక్షలు పాసవుతున్నారు. డిగ్రీ స్థాయిలో లెక్చరర్ లేకున్నా విద్యార్థులు ఎలాగోలా పరీక్షలు గట్టెక్కుతారు. ఉర్దూ, సంస్కృతం భాషలను సైతం గురువుల ప్రమేయం లేకుండా గైడ్లు ముందేసుకొని విద్యార్థులు మార్కులు తెచ్చుకుంటున్నారు. ఇపుడంతా ఆంగ్లమయం. తెలుగు భాషా పండితులు సైతం తమ పిల్లలను కానె్వంట్లలో చదివిస్తున్నారు. అధ్యాపకులే తెలుగుపై ఆసక్తిచూపడం లేదంటే ఇది విచారించవలసిన సమయం.
- కూర్మాచలం వెంకటేశ్వర్లు, కరీంనగర్