జాతీయ వార్తలు

జిఎస్‌టికి మద్దతు ఇవ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూన్ 2: వస్తుసేవల పన్ను (జిఎస్‌టి)కి ఎట్టిపరిస్థితుల్లోనూ మద్దతు ఇచ్చేదిలేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశా రు. కేంద్రం తీసుకొచ్చిప్రతిపాదించిన జిఎస్‌టి బిల్లు లో సవరణలు చేయాల్సిందేనని శుక్రవారం ఇక్కడ చెప్పారు. ఈమేరకు కొన్ని సవరణలు చేయాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాసినట్టు ఆమె వెల్లడించారు. కేంద్రం తీసుకొచ్చిన జిఎస్‌టిని ఉన్నది ఉన్నట్టుగా అమలుచేసే ప్రసక్తేలేదని, మార్చులు చేయాల్సిందేనని తృణమూల్ అధినేత్రి అన్నారు. జూలై 1 నుంచి దేశ వ్యాప్తంగా జిఎస్‌టిని అమలుచేయాల్సి ఉంది. అయితే తాము జిఎస్‌టికి మద్దతు ఇచ్చేది లేదని ఆమె తేల్చిచెప్పారు. సమాజంలో అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా మార్పులు, చేర్పులు చేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాసినట్టు మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు.‘ఇప్పుడున్న ఫార్మెట్‌లో జిఎస్‌టి అమలుచేయాలంటే కుదరదు. ఇదే విషయా న్ని లేఖలో గట్టిగా ప్రస్తావిం చాం. ముఖ్యంగా అసంఘటిత వర్గానికి జిఎస్‌టి వల్ల ఎలాంటి మేలూ చేకూరదు. కేంద్రం పునఃసమీక్షించాల్సిందే’అని ఆమె స్పష్టం చేశారు. దక్షిణ 24 పరగాణల జిల్లా పరిపాలనా సమావేశంలో ఆమె మాట్లాడారు. పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిశ్రా మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అలాగే ఉపాధిపై జిఎస్‌టి ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.‘కొన్ని ఉత్పత్తులపై పన్ను రేట్లు తగ్గించాల్సి ఉంది. ప్రస్తుత జిఎస్‌టికి వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగిస్తాం. కేంద్రం ఏకపక్షంగా అమలుచేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఉపాధిని దెబ్బతీస్తుంది’అని హెచ్చరించారు.