జాతీయ వార్తలు

పాక్ హింసను సాగనివ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 3: కాశ్మీర్ లోయలో హింసకు పాకిస్తానే కారణమని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందని, అయితే దీనికి కొంత సమయం పట్టవచ్చని ఆయన అన్నారు. ‘1947నుంచి ఈ సమస్య రగులుతూనే ఉంది. అందువల్ల దీనికి పరిష్కారం చిటికలోనో లేదా ఒకటి రెండు నెలల్లోనో సాధ్యం కాదు. కాశ్మీర్ భవిష్యత్తుకు అడ్డుగా ఉన్న ప్రతిదాన్నీ తొలగించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. భగవంతుడు కాశ్మీర్ యువతకు ప్రసాదించిన నైపుణ్యాలను రాష్ట్రం, దేశ భవిష్యత్తుకోసం ఉపయోగించుకోవడం జరుగుతుంది. వాళ్లకు చేతులున్నది రాళ్లురువ్వడానికి కాదు’ అని రాజ్‌నాథ్ అన్నారు. మూడేళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించడానికి శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. చర్చలు జరపడానికి ఎవరు ముందుకు వచ్చినా ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాజ్‌నాథ్ స్పష్టం చేస్తూ, ‘ప్రజాస్వామ్య వ్యవస్థలో చర్చలు ఎలాంటి క్లిష్టమైన సమస్యనైనా పరిష్కరించగలవు’ అని అన్నారు. అయితే కాశ్మీర్ యువతను తప్పుదోవ పట్టించి, రెచ్చగొట్టడానికి పాకిస్తాన్ ప్రోద్బలంతో పనిచేసే శక్తులు కొన్ని ఉన్నాయని, సొంతింట్లో పరిస్థితులను చక్కదిద్దుకోలేని పాకిస్తాన్ ఈ శక్తులను రెచ్చగొడుతోందని ఆయన చెప్పారు. స్థానిక శక్తులు తమ స్వార్థ ప్రయోజనాలకోసం కాశ్మీర్ యువతను రెచ్చగొడుతున్నాయని, కాశ్మీర్ భవిష్యత్తుతో ఆడుకోవడానికి ప్రభుత్వం ఎవరినీ ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించదని స్పష్టం చేశారు.