వీరాజీయం

విరాట్ తిరుగుబాటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నలభై ఆరేళ్ల అనిల్ కుంబ్లే, ఇరవై ఎనిమిదేళ్ల విరాట్ కోహ్లి- కురుక్షేత్రంలో కృష్ణార్జునుల్లా క్రికెట్ మైదానంలో ‘బస్తీమే సవాల్’గా రాణిస్తారని ఆశించాము. కాని ఇలా అత్తాకోడళ్ల మాదిరి అయిపోతారని అనుకోలేదండీ అన్నాడు నా చిన్నప్పటినుంచి క్రికెట్ మ్యాచ్ అంటే చూడ పరుగులు తీసి అరిచి అరిచి అలసి ఇంటికి తిరిగొచ్చే ఒక ‘టిపికల్ క్రికెట్ ఫ్యాన్’. చాంపియన్ ట్రోఫీ మన దేశానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కప్. దాన్ని నిలబెట్టుకోడానికి మన టీము వెళ్ళింది. మన టీము బయల్దేరి వెళ్లే నాటికే కుంబ్లే పరిస్థితి అయోమయం. ఈలోగా మన టీముకి కొత్త కోచ్ కావాలోచ్- కోరుకున్నవాళ్ళు అర్జీలు పంపండహో అంటూ టముకువేస్తే దాని అర్థమేమిటి? టీము క్యాప్టన్- టీము కూడా ఇప్పుడున్న ‘హెడ్ కోచ్‌ని చెవులు పట్టుకు ఆడించరా? ఎందుకంటే, ప్రధాన శిక్షకుడు అనిల్ కుంబ్లేని- రేపు పద్దెనిమిది నాటికి మూటాముల్లె సర్దుకో- నీకు పొడిగింపు వుండదు’ అని చెప్పి చులకన చెయ్యడమేగా అది. ‘అబ్బాయ్.. మేము ఏదో పద్ధతిని అనుసరించి ఆనవాయితీగా అప్లికేషన్లు పిలుస్తున్నాము- నువ్వు కూడా ఓ కాయితం ముక్క పడెయి’అంటే అది కొంత నయం. పోనీ తాజాగా సెలక్షన్ కోసం క్యూలో నిలబడు- మళ్లీ, ఇంటర్వ్యూ చేస్తాం అన్నా బాగుండేది. కానీ మన క్రికెట్ బోర్డు అనిల్ కుంబ్లేకి- ఇవ్వదగ్గ మర్యాద ఇవ్వలేదు. ఇవ్వకపోగా, విరాట్ కోహ్లికి అతను నచ్చలేదు కనుక- మరొకడికి అవకాశం ఇస్తాం అన్న ధోరణిలో- సెహవాగ్ పేరు సహా బోలెడు ఫీలర్స్ వదిలేరు పెద్దలు-
ఈ ఇద్దరి మధ్య క్రికెట్ బంతి పడితే దానికి చెరో తన్ను ప్రసాదిస్తున్నారన్న విషయం రచ్చ చెయ్యడం- టీమిండియా- హోరాహోరీ పోరాటాన్ని ఎదుర్కోడానికి - గుండెలు అరచేత పెట్టుకుని బర్మింగ్‌హామ్‌లో దిగినప్పుడా? వాస్తవంగా అయితే, కుంబ్లే చేసిన నేరం మరొకటి బోర్డు కూడా దృష్టిలో చూస్తే ఇంకొకటి వుంది, ప్లేయర్స్ అందరికీ పారితోషికాలు ఇబ్బడిముబ్బడిగా పెంచమని అడిగాడు- అంతటితో ఊరుకోకుండా, తనకి సంబళం ఝామ్మని పెంచేయమని డిమాండ్ చేశాడు- అవడానికి ప్రపంచం మొత్తంమీద - థాంక్స్ టు క్రికెట్ పిచ్చి అభిమానులు- అత్యంత సంపన్నమైనది మన బిసిసిఐ.. కాకపోతే లోధా కమిటీ సిఫార్సులు అమలుచెయ్యడానికి- సుప్రీంకోర్టు నేరుగా ఒక కమిటీ- సిఒఎ అంటే పాలకుల కమిటీని వినోద్రోయ్ చైర్మన్‌గా వేసింది- ఇందులో ఒకరు రామచంద్ర రావుగుహ దొడ్డమనిషి చరిత్రకారుడు- ఆయన అకస్మాత్తుగా మే 31న సుప్రీమ్ కోర్టుకి- ‘నేను నా రాజీనామా లేఖను వినోద్రోయ్‌కి ఇచ్చాను మహాప్రభో..’ అంటూ మొరపెట్టుకున్నాడు. వ్యక్తిగత కారణాలు అన్నాడు కాని, ఆయన ప్రొటెస్టు కుంబ్లే ఉద్వాసనకి సంబంధించి అని అభిజ్ఞవర్గాల భోగట్టా. మూడు రోజుల ముందే గుహగారు బిసిసీఐ సియివో రాహుల్ జోహ్రీకి ఇతర సభ్యులకి కూడా ఈ-మెయిలు మీద చెప్పాడుట- కోచ్ నియామకంలో విరాట్ కోహ్లి ప్రమేయం ప్రమాదకరమయిన సంప్రదాయానికి దారితీస్తుంది అని. మొదటినుంచి అతను కుంబ్లే సమర్ధకుడు అది వేరే సంగతి- కానీ, ఆయన వాదనలో కూడా అర్థం లేకపోలేదు- ఇవాళ కోచ్‌ని క్యాప్టన్ ఇష్టం మీద వేస్తారు- రేపు సెలక్షన్ కమిటీ మెంబర్స్‌ని కూడా మా ఇష్టం వచ్చిన వాళ్ళనే వేయమని డ్రెస్సింగురూము నుంచి ఒత్తిడి వస్తే? విరాట్ ఈమధ్యనే అన్నాడు- కోచ్‌ని కనీసం మూడేండ్లకు నియమించాలని. ఇది ఇలా వుండనిండు.
ఇండియన్ టీమ్ వార్మప్ మ్యాచ్‌లలో న్యూజిలాండుని, బంగ్లాదేశ్‌ని కూడా సునాయాసంగా ఓడించింది. మర్నాడు ఆటగాండ్రు ‘గాండ్రు గాండ్రు’మంటున్న పులుల లాగ ప్రాక్టీసు కోసం ఫీల్డులోకి వస్తూ వుంటే- అవతల బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు అమితాబ్ చౌదరి- విలేఖరుల నుంచి గూగ్లీలు ఫేస్ చేస్తున్నాడు. ‘పొగా? ఎక్కడా?’అని అడిగాడు- కోహ్లి, కోచ్‌ల మధ్య నిప్పు రాజుకుంటున్న పొగ వస్తోంది చూశారా? అంటే ఆయన గడుసు సమాధానమది. అవతల ఫీల్డులో ‘జంబో ది కోచ్’ తన సామాగ్రితో ప్రాక్టీసింగు క్రీజ్‌కి రాంగానే ఇవతల్నుంచి మన హీరో కోహ్లి జారుకున్నాడు. సౌరభ్ గంగూలీ, ఇయాన్ ఛాపెల్‌ల ప్రహసనం లాంటిదే కాని, ఇక్కడ కోచ్‌మీద క్యాప్టన్ గుర్రు-కథ మారింది. కోచ్ విషయంలో ఇంత రాద్ధాంతం దేనికి? పైగా, కుంబ్లే వచ్చిన తరువాత ఐదు టెస్టు సిరీస్ జేబులో వేసుకుని మన టీము విర్రవీగింది- ఓటమి లేదు. కాని, విరాట్‌కు రవిశాస్ర్తీ మీద మోజున్నది. కాని రవిశాస్ర్తీ- తనని కోచ్‌గా వేసుకోమన్నప్పుడు సౌరభ్ అడ్డం పడ్డాడని రోడ్కెక్కాడు. ఇవాళ మళ్ళీ అప్లికేషను పెట్టి భంగపడలేడు. కోహ్లి మొదటి నుంచి కుంబ్లేకి సుముఖుడు కాడు అని మాజీ ఆఫీసు బేరర్లు ఇప్పుడు బయటపడుతున్నారు. కాకపోతే, గవాస్కర్ అన్నట్లు ఈ విషయంలో ‘త్రిమూర్తుల’ కమిటీ సిఫార్సులను అమలుచెయ్యాలి. ఆ ముగ్గురు- సౌరభ్, సచిన్, వీవీఎస్‌లు.
లోగడ ఆస్ట్రేలియా టెస్టు పోటీల సందర్భంగా హెడ్ కోచ్ కుంబ్లే కులదీప్ యాదవ్‌ని ఆడిస్తానంటే విరాట్ వొద్దన్నాడట! కోచ్ వింటాడా? అట్లాగే, ఒకటి రెండుసార్లు బౌలింగ్ చానె్సస్ విషయంలో సూచనలిస్తూ మైదానంలోకి కబురు పంపాతే తప్పా? ఐపిఎల్ మ్యాచ్‌లో టామ్‌మూడి చెంజేస్ చాలాసార్లు బౌండరీ లైన్ దగ్గరకొచ్చి- సలహాలు ఇవ్వడం కనబడ్డది-
పైగా, కుంబ్లే అల్లాటప్ప క్రికెటర్ కాదు ఒక లివింగ్ లెజెండ్‌గా వాసికెక్కినవాడు- కాగా హంగులు ఎక్కువ అయిపోతున్నాయి- హెడ్ కోచ్- అతని కింద - మెడికల్ స్పెషలిస్టుల మాదిరి, ఫీల్డింగ్ ఓ కోచ్, ఫాస్ట్ బాల్స్‌కో గురువు- స్పిన్‌కి ఇంకో స్పెషలిస్టు- ఇంకా ఎందరెందరో శిక్షకులు- లోగడ సునీల్ మనోహర్ - అంటే తొలి పదివేల పరుగులు వీరుడు- ఇప్పుడు ‘కులపెద్ద’ చెప్పాడు- మా రోజుల్లో ఇట్లా వొళ్ళు హూనం అయ్యే వ్యాయామం- కరసత్తు- సర్కస్ మాదిరి ఫీట్స్‌లేవు- గ్రౌండ్‌చుట్టూ నాల్గు రౌండ్లు- బస్కీలు, దండీలు అంతే- కోచింగులో ఇలా ప్రాణాలు కొరికే యాతన లేదు- పైగా, ఈ హింసతో ప్లేయర్‌కి వున్న టాలెంటు చల్లారిపోయే ప్రమాదం వుంది- సినిమా స్టార్ మేకప్‌మేన్‌ల మాదిరి మళ్ళీ వేరువేరు కోచ్‌లను తెచ్చుకునే రోజు వస్తుందేమో? ఇప్పటికే ప్లేయర్స్‌ను ఎడాపెడా వాయించేస్తున్నారు- తీరా ఈ వీరుడు పరిగెత్తి పరిగెత్తి వచ్చి యార్కర్ వెయ్యబోతే దారితప్పి అపి వైడ్ బాల్ అవుతుంది. అసలు ‘స్కిల్’ హుష్‌కాకి అయిపోతోంది. అనిల్ కుంబ్లే కొంత చాదస్తుడే పిల్లకాయల్ని ట్రీట్ చేసినట్లు మరీ స్ట్రిక్కు అంటారు కాని, చనువిస్తే ‘రా గురు ఓ పెగ్గేదాము’ అంటాడు ఓ ప్లేయరు భుజం మీద చెయ్యివేసి మరీ. ఏది ఏమయినా ఒక సామెత వుంది- ‘పని ముద్దు.. కానీ పిల్ల అందం కాదు’- అని. అలాగే మనవాడు- దేశం ప్రతిష్ఠను పెంచిన గ్రేటెస్ట్ రికార్డు హోల్డరు.. సో, అనిల్‌ని- కన్విన్సు చేసి- ట్రేడ్ యూనియన్ మెటాలిటీ వదిలి క్రీడాస్ఫూర్తి చూపించమని’- ఒప్పించాలి టామ్ మోడీలు వెట్టోరీలు మనకొద్దు- మనం టాప్ క్రికెటర్ల దేశం- ముద్దు చెయ్యండి విరాట్‌కి. కొంచెం ముదురు- దురుసుకాని బ్యాట్ ఝుళిపిస్తే పెద్ద పులి.. అని అందుకేగా సతీమణులకు ఇచ్చే స్టేటస్ ఇచ్చి అతని గాళ్‌ఫ్రెండుకి కూడా అతని రూమ్‌లో సదుపాయం ఇచ్చారు- కానీ, వీటో పవర్స్ ఇవ్వకండి. కోహ్లి అన్నట్లు ఆ మూడేళ్ళు జంబోకే ఎక్స్ప్‌క్టేషన్ ఇవ్వరనుకో- హేమాహేమీలు అందరూ లండన్‌లో వున్నారు ఇప్పుడు.. ట్రోఫీ వచ్చేదాకా ఆగండి.. సిగపట్ల గోత్రం ఆపండి. కుంబ్లేకి తగిన మన్నన ఇవ్వడం అందరి విధి- ఎందుకంటే అతను మ్యాచ్ విన్నర్.
- బెటర్ టు బ్రింగ్ బ్యాక్ ది ఈక్విలిబ్రియం! *