కర్నూల్

‘నవ నిర్మాణ దీక్ష’లో కర్నూలు భేష్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలుటౌన్, జూన్ 4:నవనిర్మాణ దీక్షలో కర్నూలు జిల్లా పనితీరు సంతృప్తిగా ఉందని మిగిలిన జిల్లా కలెక్టర్లు కర్నూలు కలెక్టర్ సత్యనారాయణను ఆదర్శంగా తీసుకోవాలని సిఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లను ఆదేశించారు. నవ నిర్మాణ దీక్షపై సిఎం చంద్రబాబు ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో 13 జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లాలో దీక్షలకు సంబంధించి కలెక్టర్ అరగంట పాటు వివరించారు. అందు లో ప్రధానంగా నవనిర్మాణ దీక్షకు సంబంధించిన చర్చించాల్సిన అంశాలపై ఒకరోజు ముందుగానే నియోజకవర్గాల నోడల్ అదికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి చేపట్టావల్సిన అంశా లు, చర్చించాల్సిన వాటిపై ముందుగా ప్రణాళికలు చేస్తున్నామని, రెండవ రో జు ముగిసిన అనంతరం అదేరోజు రాత్రి 3వ రోజు చర్చించాల్సిన అంశాలపై సంబంధిత శాఖలతో మూడేళ్లు సాధించిన ప్రగతి, అందులో లబ్ధిదారులను నవనిర్మాణ దీక్షలకు ఆహ్వానించి వారితోనే సాధించిన ప్రగతిపై తెలియజేస్తున్నామన్నాని వివరించారు. ఇదేవిధంగా మిగతా జిల్లాల్లో కూడా తీసుకోవాలని సిఎం అన్ని శాఖల శాఖాధిపతులు, కలెక్టర్లను ఆదేశించారు. 3వ రోజు వ్యవసాయం, అనుబంధ రంగాలు, జలసంరక్షణ, సుస్థిర అభివృద్దిపై రైతులను ఆహ్వానించామన్నారు. ఆ సభకు రైతులు, ఆదర్శ రైతు లు, కౌలు రైతులు కూడా హాజరై సా ధించిన ప్రగతిని వివరించాలని కర్నూ లు కలెక్టర్ సిఎంకు నివేదించారు.
మాయలూరులో రైల్వేస్టేషన్ ఏర్పాటుకు కృషి
* మంత్రి అఖిలప్రియ
ఉయ్యాలవాడ, జూన్ 4: నంద్యాల- యర్రగుంట్ల రైల్వే మార్గంలో మండలంలోని మాయలూరు గ్రామం వద్ద స్టేషన్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ తెలిపారు. ఆదివారం మండలంలోని మాయలూరు గ్రామం లో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన మంత్రి విలేఖరులతో మాట్లాడా రు. రైల్వేస్టేషన్ ఏర్పాటుకు కోసం ఇప్పటికే కేంద్ర పట్టణ, గ్రామీణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడుతో చర్చించామన్నారు. స్టేషన్ ఏర్పాటు వల్ల ఉయ్యాలవాడ, ఆళ్లగడ్డ, దొర్నిపాడు, చాగలమర్రి మండల ప్రజలకు రాష్ట్ర రాజధాని అమరావతి చేరుకునేందుకు సులభతరంగా ఉంటుందన్నారు. ఆళ్లగడ్డ నుండి ఆర్.పాంపల్లె తారురోడ్డు నిర్మాణానికి రూ.8కోట్లు నిధులు మంజూరయ్యాయని, టెండర్లు పూర్తి కాగానే పనులు ప్రారంభిస్తామన్నారు. మాయలూరు గ్రామంలో లిప్ట్ ఇరిగేషన్ ఏర్పాటుకు ఉప ముఖ్యమంత్రి కెఇ క్రిష్ణమూర్తి, చిన్న నీటి పారుదల శాఖ మంత్రి పితాని సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లామన్నారు. గ్రామంలో రూ.25 లక్షలతో ఓవర్‌హెడ్ ట్యాంకు, శ్మశాన వాటికకు రూ.9.60 లక్షలు నిధులు మంజూరయ్యాయన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూ.4.50 కోట్లు నిధులు కేటాయించారని, రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబునాయుడతోనే సాద్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ బివి రామిరెడ్డి, భూమా బ్రహ్మానందరెడ్డి, మండల టిడిపి నాయకులు పేరెడ్డి మోహన్‌రెడ్డి, గడ్డం దస్తగిరిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.