జాతీయ వార్తలు

రుతుపవనాల మందగమనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 4: ఎంతో ఆశపెట్టుకున్న నైరుతి రుతుపవనాలు తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. అనుకున్న సమయానికే కేరళను తాకిన రుతుపవనాలు రాష్ట్రాన్ని వచ్చే క్రమంలో కాస్త వెనుకబడ్డాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన వాతావరణ మార్పులతో కేరళ వరకూ వచ్చిన రుతుపవనాలు అక్కడే స్థిరంగా నిలిచిపోయాయి. ప్రస్తుతం కేరళలోని కోచి, తమిళనాడుకు తూర్పు ప్రాంతంలో ఉన్న నైరుతి రుతుపవనాలు ఎపిలోని రాయలసీమకు తాకేందుకు మరో మూడు, నాలుగు రోజులు పట్టే అవకాశం ఉందని విశాఖ వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ఆదివారం వెల్లడించారు. రుతుపవనాల గమనంలో చోటుచేసుకున్న మార్పులే ఆలస్యానికి కారణంగా పేర్కొన్నారు. అయితే రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు.