జాతీయ వార్తలు

మార్పులు చెబితే.. పరిశీలిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 4: పశు వధను నిషేధిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌పై వివిధ వర్గాలు చేసిన సూచనలను పరిశీలించడానికి సిద్ధం గా ఉన్నామని, దీన్ని ప్రతిష్ఠకు సంబంధించిన అంశంగా చూడడం లేదని ప్రభుత్వం ఆదివారం స్పష్టం చేసిం ది. పశు వధపై ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌పై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ వివరణ ఇవ్వడం గమనార్హం. ఈ నోటిఫికేషన్ జారీ వెనుక ఉద్దేశం ఏ ఒక్క వర్గాన్ని గాయపర్చడం, ఆహారపు అలవాట్లను ప్రభావితం చేయడం, లేదా కబేళాల వ్యాపారాన్ని దెబ్బ తీయడమో కాని కాదని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ‘వివిధ వర్గాలు సమర్పిస్తున్న సూచనలను పరిశీలిస్తాం. ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రతిష్ఠకు చెందిన అంశంగా చూడడం లేదు’ అని అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమం నేపథ్యంలో విలేఖరులతో మాట్లాడుతూ మంత్రి చెప్పారు. సూచనలను పరిశీలిస్తారా, ఈ అంశంపై ప్రభుత్వం ప్రత్యామ్నాయ అభిప్రాయాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉందా అని విలేఖరులు అడిగినప్పుడు మంత్రి ఈ విషయం చెప్పారు.
బీఫ్ తినడం, సంత ల్లో పశువుల విక్రయంపై నిషేధం పట్ల వివాదం దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మార డం తెలిసిందే. కేరళ, తమిళనాడు, కర్నాటక సహా పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ప్రదర్శనలు సైతం నిర్వహించారు. ఈ నిషేధం అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంటూ, తమ ప్రభుత్వం దీన్ని అంగీకరించబోదని స్పష్టం చేశారు. అయితే పశువుల పట్ల క్రూరత్వ నిరోధక చట్టం కింద జారీ చేసిన ఈ నిబంధనలను ఆహారపు అలవాట్లను ప్రభావితం చేసేందుకుగానీ, లేదా కబేళాల వ్యాపారాన్ని దెబ్బతీసేందుకు గానీ జారీ చేయలేదని హర్షవర్ధన్ స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత ప్రత్యామ్నాయ అభిప్రాయాలను కూడా పరిశీలించాలని ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు అందాయని మంత్రి తెలిపారు.