జాతీయ వార్తలు

ప్రణయ్ రాయ్ ఇంట్లో సిబిఐ సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 5: ఎన్డీటీవీ వ్యవస్థాపకుడు ప్రణయ్ రాయ్ ఇంటిపై సోమవారం సిబిఐ దాడులు నిర్వహించింది. ఓ షేర్ లావాదేవీ గురించి సెబికి తెలియజేయకుండా దాచి ఉంచినందుకు, ఓ ప్రైవేట్ బ్యాంకును మోసం చేసిన ఆరోపణలపై సిబిఐ ఆయనపై కేసు నమోదు చేసింది. ప్రణయ్ రాయ్, ఆయన భార్య రాధిక పేరుతో ఉన్న ఆర్‌ఆర్‌పిఆర్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు గుర్తుతెలియని పలువురు అధికారులపై నేరపూరిత కుట్ర, మోసం, అవినీతి అభియోగాలను మోపింది. ఎన్డీటివీకి చెందిన 20శాతం షేర్లను కొనటానికి ఇండియా బుల్స్ కంపెనీ నుంచి 500 కోట్ల రూపాయల రుణం ప్రణయ్ కంపెనీ తీసుకుంది. అంతేకాకుండా ఏడాదికి 19శాతం వడ్డీ చెల్లించేలా ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి 375కోట్ల రుణాన్ని ఈ కంపెనీ తీసుకుందని సిబిఐ ఆరోపించింది. ఈ పేర్కొన్న షేర్లకు సంబంధించిన వివరాలు సెబికి కానీ, స్టాక్ ఎక్స్చేంజిలకు కానీ, కేంద్ర సమాచార ప్రసార శాఖకు కానీ తెలియదని సిబిఐ పేర్కొంది. ఈ మొత్తం వోటింగ్ కాపిటల్ కంటే 61శాతం ఎక్కువని తెలియజేసింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టంలోని 19(2)సెక్షన్‌ను ప్రణయ్ కంపెనీ ఉల్లంఘించిందని వివరించింది.
సిబిఐ దాడులపై ఎన్డీటీవీ తీవ్రంగా స్పందించింది. ‘ఈ ఉదయం సిబిఐ ఎన్డీటీవి, దాని ప్రమోటర్లపై వేధింపులు ప్రారంభించింది. నిరాధార ఆరోపణలతో దాడులు చేసింది’ అని ఎన్డీటీవి వ్యాఖ్యానించింది. తాము ఎవరికీ తలొగ్గేది లేదని, ప్రజాస్వామ్యాన్ని, వాక్స్వాతంత్య్రాన్ని తక్కువ అంచనా వేయవద్దని హెచ్చరించింది. తాము ఈ దేశంకోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేసింది.
ఎన్డీటీవీ వ్యవస్థాపకుడు ప్రణయ్ రాయ్ ఇంటిపై సిబిఐ దాడుల విషయంలో రాజకీయ ప్రమేయం ఏదీ లేదని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం అన్నారు. మీడియాలో ఉన్నాం కదా అని ఎవరైనా తప్పుచేసి ప్రభుత్వాన్ని వౌనంగా ఉండమనటం సరికాదు కదా అని ఆయన వ్యాఖ్యానించారు. సిబిఐకి సమాచారం రావటంవల్ల వారు చర్యలు తీసుకుని ఉంటారని వెంకయ్య అన్నారు.